Specially abled swiggy delivery agent : వీల్​ఛైర్​పై ఫుడ్​ డెలివరీ చేస్తున్న దివ్యాంగురాలు-watch specially abled swiggy delivery agent rides wheelchair to deliver food ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Watch Specially Abled Swiggy Delivery Agent Rides Wheelchair To Deliver Food

Specially abled swiggy delivery agent : వీల్​ఛైర్​పై ఫుడ్​ డెలివరీ చేస్తున్న దివ్యాంగురాలు

Sharath Chitturi HT Telugu
Sep 11, 2022 09:06 PM IST

Specially abled delivery agent : వీల్​ఛైర్​పై వెళుతూ.. ఓ మహిళ ఫుడ్​ డెలివరీ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నెటిజన్లు ఆమెకు సెల్యూట్​ చేస్తున్నారు.

వీల్​ఛైర్​పై ఫుడ్​ డెలివరీ చేస్తున్న దివ్యాంగురాలు
వీల్​ఛైర్​పై ఫుడ్​ డెలివరీ చేస్తున్న దివ్యాంగురాలు (Twitter/@SwatiJaiHind)

Specially abled delivery agent : శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పని చేస్తున్నా.. ఏ పనీ చేయకుండా, సోమరిపోతులా ఖాళీగా ఉండే వాళ్లు చాలా మందే ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎదురెళ్లి పోరాడి నలుగురికి స్ఫూర్తిగా నిలిచేవారు కూడా ఉంటారు. ఆ రెండో రకానికి చెందిన ఓ మహిళ గురించి ఇప్పుడు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. స్విగ్గీలో డెలివరీ ఏజెంట్​గా పనిచేస్తున్న ఆ దివ్యాంగురాలు.. వీల్​ఛైర్​పై ఫుడ్​ డెలివరీ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తాజాగా వైరల్​గా మారింది.

ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్​ ఛైర్మన్​ స్వాతి మలివాల్​ ట్వీట్​ చేశారు. వీడియోలో ఓ దివ్యాంగురాలు.. వీల్​ఛైర్​తో కూడిన ఓ చిన్న వాహనం మీద కూర్చుంది. ఆమె స్విగ్గీ టీషర్ట్​ ధరించింది. ఆమె వెనక స్విగ్గీ డెలివరీ బ్యాగు ఉంది. కస్టమర్​కి ఫుడ్​ డెలివరీ చేసేందుకు వీల్​ఛైర్​పై ఆ మహిళ వెళుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 'ఈ మహిళకు సెల్యూట్​,' అని ఓ వ్యక్తి రాసుకొచ్చారు. "ఎన్ని కష్టాలు ఉన్నా.. ఆమె పోరాడుతోంది. తన జీవితాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. హట్సాఫ్​," అంటూ మరో వ్యక్తి ట్వీట్​ చేశారు.

బిడ్డలను మోస్తూ.. ఫుడ్​ డెలివరీ..

Zomato delivery agent : జొమాటో, స్విగ్గీ.. ఈ ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ యాప్స్​లో చాలా మంది డెలివరీ ఏజెంట్​లుగా పనిచేస్తుంటారు. వారిలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఈ కథల్లో కొన్ని స్ఫూర్తిదాయకంగా ఉంటే.. మరికొన్ని బాధాకరంగా ఉంటాయి. ఏదిఏమైనా.. ప్రతి కథ నుంచి ఏదో ఒకటి నేర్చుకుని ముందుకు వెళ్లిపోవడమే జీవితం! తాజాగా.. ఓ జొమాటో డెలివరీ బాయ్​కి సంబంధించిన కథ ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. తన ఇద్దరు బిడ్డలను మోస్తూ.. అతను ఫుడ్​ డెలివరీ చేసేందుకు వెళుతుండటం వార్తలకెక్కింది.

ఫుడ్​ బ్లాగర్​ సౌరభ్​ పంజ్వాని.. ఈ వీడియోను తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశాడు. ఓ జొమాటో డెలివరీ బాయ్​ని వీడియో తీశాడు. అతడిని తన ఫాలోవర్లకు పరిచయం చేశాడు. ఆ డెలివరీ బాయ్​.. తన పసి పాపను మోస్తూ కనిపించాడు. మరో బిడ్డ.. అతని పక్కనే ఉన్నాడు.

"నాకు చాలా ఇన్​స్పైరింగ్​గా అనిపించింది. ఈ జొమాటో డెలివరీ బాయ్​.. తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఫుడ్​ డెలివరీ చేస్తున్నాడు. రోజంతా ఎండలోనే ఉంటున్నారు. మనిషికి ఏదైనా కావాలంటే.. దానిని కచ్చితంగా చేసి తీరుతాడు అని దీని నుంచి మనం నేర్చుకోవాలి," అని వీడియో కింత రాసుకొచ్చాడు సౌరభ్​.

తన కుమారుడు.. ఫుడ్​ డెలివరీలో తనకు సాయం చేస్తాడని ఆ జొమాటో డెలివరీ బాయ్​ చెప్పుకొచ్చాడు.

ఈ వీడియో.. కొన్ని గంటల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిపోయింది. ఈ వ్యవహారంపై జొమాటో కూడా స్పందించింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం