Bypolls 2022: 6 రాష్ట్రాల్లో 'ఉప' సమరం- బరిలో సీఎం-voting on for bypolls 2022 on 23rd june in 6 states tripura cm among key candidates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Voting On For Bypolls 2022 On 23rd June In 6 States. Tripura Cm Among Key Candidates

Bypolls 2022: 6 రాష్ట్రాల్లో 'ఉప' సమరం- బరిలో సీఎం

Sharath Chitturi HT Telugu
Jun 23, 2022 08:36 AM IST

Bypolls 2022: దేశంలో కీలకమైన ఉప ఎన్నికల సమరం మొదలైంది. 3 లోక్​సభ, 7 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​ జరుగుతోంది. అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఝార్ఖండ్​ మాందర్​లో ఓటు వేసేందుకు వేచి ఉన్న ఓటర్లు
ఝార్ఖండ్​ మాందర్​లో ఓటు వేసేందుకు వేచి ఉన్న ఓటర్లు (ANI)

Bypolls 2022: ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికల సమరం మొదలైంది. ఢిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్​, ఝార్ఖండ్​, ఆంధ్రప్రదేశ్​లోని మొత్తం మూడు లోక్​సభ, 7 అసెంబ్లీ సీట్లకు గురువారం ఉపఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అధికారులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఢిల్లీ.. పంజాబ్​..

ఢిల్లీ, పంజాబ్​ ఉపఎన్నికలపై ఆప్​ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీ.. తన బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. రాజేందర్​ నగర్​ నియోజకవర్గంలో 'ఉప' పోరు నడుస్తోంది. ఇక్కడ అధికార ఆప్​, విపక్ష బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం మీద 1.6లక్షల మంది ఓటర్లు ఉండగా.. 14మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు.

By elections 2022 : పంజాబ్​లోని సంగ్రూర్​లో ఉప ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా గెలుపొందిన అనంతరం సంగ్రూర్​ ఎంపీగా భగవంత్​ మన్​ రాజీనామా చేయడంతో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా.. పంజాబ్​లో సిద్ధూ మూసేవాలా మరణం అనంతరం అక్కడి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మరి తాజా ఎన్నికల్లో 15లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకుని ఎవరిని గెలిపిస్తారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

బరిలో సీఎం..

త్రిపురలోనూ ఈ ఉపఎన్నికలు కీలకంగా మారాయి. స్వయంగా ఆ రాష్ట్ర సీఎం మానిక్​ సాహా ఈ ఉపఎన్నికలో బరిలో ఉండటం ఇందుకు కారణం. బోర్దోవాలి నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో నిలబడ్డారు. అగర్తల, సుర్మా, జబరాజ్​నగర్​లోనూ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి.

Tripura by election : అప్పటివరకు ముఖ్యమంత్రిగా విప్లవ్​ దేవ్​పై అసంతృప్తి పెరగడంతో ఆయన్ని తప్పించి మానిక్​కు అవకాశం ఇచ్చింది కమలదళం. మరికొన్ని నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల ఈ ఉప ఎన్నికలు మరింత కీలకంగా మారింది.

వీటితో పాటు ఆంధ్రప్రదేశ్​లోని ఆత్మకూర్​, ఝార్ఖండ్​ మాందర్​, ఉత్తర్​ప్రదేశ్​ అజామ్​గఢ్​, రామ్​పూర్​లో ఉప సమరం నడుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం