Viral Video: 105 ఏళ్ల తండ్రి కోసం పాటపాడిన 68 ఏళ్ల కుమారుడు.. హృదయాలను కదిలిస్తున్న వీడియో-viral video 68 year old son sang song for his 105 year old father ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Viral Video 68 Year Old Son Sang Song For His 105 Year Old Father

Viral Video: 105 ఏళ్ల తండ్రి కోసం పాటపాడిన 68 ఏళ్ల కుమారుడు.. హృదయాలను కదిలిస్తున్న వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 21, 2023 01:12 PM IST

Viral Video: 105 ఏళ్ల తండ్రి కోసం ఓ కుమారుడు పాటపాడారు. మంచానికి పరిమితమైన తన తండ్రిని సంతోషపెట్టేందుకు 68 ఏళ్ల ఆ కొడుకు ఎంతో అందంగా పాడారు.

Viral Video: 105 ఏళ్ల తండ్రి కోసం పాటపాడిన 68 ఏళ్ల కుమారుడు
Viral Video: 105 ఏళ్ల తండ్రి కోసం పాటపాడిన 68 ఏళ్ల కుమారుడు

Viral Video: తండ్రి, కొడుకుల మధ్య బంధం చాలా అపురూపంగా ఉంటుంది. చాలా మంది దీన్ని మాటల్లో వర్ణించలేరు. చాలాసార్లు తండ్రి, కొడుకులు తమ ఆప్యాయతను బయటికి ప్రదర్శించరు. అయితే వారి మధ్య ప్రేమ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నామనుకుంటున్నారా.. మంచానికే పరిమితమైన తన తండ్రి కోసం ఓ కొడుకు పాటపాడారు. 105 ఏళ్ల వయసు ఉన్న తండ్రిని సంతోషపెట్టేందుకు 68 ఏళ్ల కొడుకు లయబద్ధంగా పాటపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. చాలా మంది హృదయాలను కదిలిస్తోంది.

Viral Video: శ్రీని అనే యూజర్ ట్విట్టర్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. 105 ఏళ్ల తండ్రి కోసం 68 ఏళ్ల కొడుకు పాటపాడిన వీడియోను ట్వీట్ చేశారు. ముందుగా తండ్రితో మాట్లాడిన ఆ కుమారుడు శ్రావ్యమైన ఈలతో పాట ప్రారంభించారు. ఆ తర్వాత పాట పాడారు. ఈ వీడియో హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 2.78 లక్షల మందికి పైగా యూజర్లు చూశారు. 16వేలకు పైగా లైక్స్, చాలా కామెంట్లు వచ్చాయి.

Viral Video: ఈ వీడియో చూస్తుంటే తమ హృదయానికి ఎంతో సంతోషం కలుగుతోందని చాలా మంది యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. నిజమైన ప్రేమ, అనురాగం అంటే ఇదే అంటూ మరికొందరు రాసుకొచ్చారు. “చివర్లో ట్యూన్‍కు తగ్గట్టు ఆ తండ్రి వేళ్లు కదిలించారు. ఇది హృదయానికి ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇష్టమైన వారిని ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటే జీవితంలోని అన్ని సమస్యలుగా చిన్నగా కనిపిస్తాయి” అని మరో యూజర్ కామెంట్ చేశారు.

ఈ వీడియోలో ఉన్నది తన తండ్రి, సోదరుడు అని జగన్నాథన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. తన తండ్రి వయసు 104 సంవత్సరాలు నిండి.. 105 సంవత్సరంలో అడుగుపెట్టారని, తన సోదరుడి వయసు 68 ఏళ్లు అని తెలిపారు. తనకు 74 ఏళ్లు నిండాయని పేర్కొన్నారు.

IPL_Entry_Point