Gujarat ex sarpanch viral video : రోడ్డు మీద నోట్ల కట్టల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్​!-vira video shows former sarpanch showers cash at wedding event in gujarat s mehsana
Telugu News  /  National International  /  Vira Video Shows Former Sarpanch Showers Cash At Wedding Event In Gujarat's Mehsana
రోడ్డు మీద నోట్ల కట్టల వర్షం కురిపించిన మాజీ సర్పంచి!
రోడ్డు మీద నోట్ల కట్టల వర్షం కురిపించిన మాజీ సర్పంచి!

Gujarat ex sarpanch viral video : రోడ్డు మీద నోట్ల కట్టల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్​!

20 February 2023, 10:40 ISTSharath Chitturi
20 February 2023, 10:40 IST

Gujarat ex sarpanch viral video : గుజరాత్​లోని ఓ మాజీ సర్పంచ్​.. తన ఇంటి పై నుంచి నోట్ల కట్టలను కిందికి విసిరారు. కింద ఉన్న ప్రజలు వాటిని పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. తన మేనల్లుడి పెళ్లిని ఈ విధంగా సెలబ్రేట్​ చేస్తున్నారు ఆ మాజీ సర్పంచ్​.

Ex sarpanch showers cash at wedding event : సినిమాల్లో హీరోలు, విలన్​లు నోట్ల కట్టలను రోడ్ల మీదకు విసిరే సన్నివేశాలు చాలాసార్లు చూసే ఉంటాము. మరి రియల్​ లైఫ్​లో ఇలా జరిగితే? గుజరాత్​కు చెందిన ఓ మాజీ సర్పంచ్​.. తన ఇంటి పై నుంచి నోట్ల కట్టలను వెదజల్లారు! ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

మేనల్లుడి పెళ్లి పేరుతో..

గుజరాత్​ మెహ్సానా జిల్లాకు చెందిన అగోల్​లో నివాసముంటారు కరీమ్​ యాదవ్​. ఆయన ఆ ప్రాంతానికి మాజీ సర్పంచ్​. ఇటీవలే ఆయన మేనల్లుడి పెళ్లి జరిగింది. వివాహ వేడుకలంటే.. సాధారణంగా ఎవరైనా వరుడు, వధువులపై పువ్వులు, అక్షింతలు వంటివి జల్లుతారు. కానీ కరీమ్​ యాదవ్​ మాత్రం.. తన మేనల్లుడి పెళ్లిని గ్రాండ్​గా, గుర్తుండిపోయే విధంగా చేయాలని ఫిక్స్​ అయ్యారు. అంతే.. ఇంటిపైకి వెళ్లి నోట్ల కట్టలను విసరడం మొదలుపెట్టారు. ఆయన కుటుంబసభ్యులు కూడా నోట్లను విసిరారు. కింద ఉన్న ప్రజలు.. వాటిని పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.

Gujarat Ex sarpanch Karim Yadav : రూ. 100, రూ. 500 నోట్లును ఇంటిపై నుంచి సర్పంచ్​, ఆయన కుటుంబం విసురుతుండగా.. వెనకాల బాలీవుడ్​ సాంగ్స్​ ప్లే అయ్యాయి. కింద ప్రజలు నోట్లను పట్టుకోవడంలో బిజీబిజీగా ఉండిపోయారు.

ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజిన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

Gujarat viral video : "ఆదాయపు పన్నుశాఖ రెడీగా ఉంది. జాగ్రత్తా," అని ఓ నెటిజన్​ రాసుకొస్తే.. 'ద్రవ్యోల్బణంతో అమెరికా, యూరోప్​ దేశాలు అల్లాడిపోతుంటే, ఇండియాలో మాత్రం ఇలాంటివి కనిపిస్తున్నాయి,' అని మరో వ్యక్తి కామెంట్​ చేశారు. 'గుజరాత్​లో ఇది చాలా సాధారణమైన విషయం. భజనల్లో లక్షల రూపాయలు విలువ చేసే నోట్లు ఇలా గాల్లోకి ఎగురుతాయి,' అని ఇంకో నెటిజన్​ చెప్పారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలు ఇక్కడ చూడండి :

ఫేమస్​ అవ్వడానికి..!

Gujarat Ex sarpanch showers cash : బెంగళూరులో ఇటీవలే ఈ తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి.. ఫ్లై ఓవర్​ మీదకు వెళ్లి రూ. 10 నోట్లు విసిరేశాడు. కింద ట్రాఫిక్​లో ఉన్న ప్రజలు.. వాటిని పట్టుకునేందుకు ఎగబడ్డారు. తమ యూట్యూబ్​ వీడియో కోసం ఆ వ్యక్తి ఇలా చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద రూ. 3వేల వరకు అలా ఫ్లై ఓవర్​ నుంచి గాల్లోకి ఎగరేశాడు ఆ వ్యక్తి.

ఈ తరహా ఘటనలపై పలు వర్గాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పేదలు తిండి లేక విలవిలలాడుతుంటే.. డబ్బు విలువ తెలియన కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు.