Vande Bharat Express: ముచ్చటగా మూడో ‘సారీ..’-varanasi vande bharat express suffers snag passengers shifted to another train ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Varanasi Vande Bharat Express Suffers Snag; Passengers Shifted To Another Train

Vande Bharat Express: ముచ్చటగా మూడో ‘సారీ..’

HT Telugu Desk HT Telugu
Oct 08, 2022 06:17 PM IST

Vande Bharat Express: భారతీయ రైల్వే ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ముహూర్త బలం బాగాలేన్నట్లు కనిపిస్తోంది. ఈ సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ కు గురువారం నుంచి వరుసగా సమస్యలు ఎదురవుతున్నాయి.

న్యూఢిల్లీ - వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణీకులు
న్యూఢిల్లీ - వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణీకులు (ANI)

Vande Bharat Express: న్యూఢిల్లీ - వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు లో స్వల్ప సమస్య ఏర్పడింది. ముంబై - గాంధీనగర్ మార్గంలో ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు గత రెండు రోజులు వరుసగా స్వల్ప ప్రమాదానికి గురైంది. తాజాగా, శనివారం న్యూఢిల్లీ - వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు లో స్వల్ప సాంకేతిక సమస్య ఏర్పడింది.

Vande Bharat Express: సాంకేతిక సమస్య..

తాజాగా, శనివారం న్యూఢిల్లీ - వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు లో 22436 నెంబర్ గల సీ 8 కోచ్ లో బేరింగ్ సమస్య తలెత్తింది. దాంతో, ధన్ కౌర్, వాయిర్ స్టేషన్ల మధ్య రైలు నిలిచి పోయింది. అనంతరం, అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది ఆ సమస్యను పరిష్కరించారు. కానీ అదే బోగీకి సంబంధించిన ఒక రైలు చక్రంలో సమస్య తలెత్తడంతో గంటకు 20 కిమీల స్వల్ప వేగంతో అక్కడి నుంచి ఖుర్జా స్టేషన్ కు ప్రయాణించింది. అక్కడ ఆ బోగీని మార్చారు. ప్రయాణం ఆలస్యమవుతుండడంతో రైలులోని ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈ సాంకేతిక సమస్యకు సంబంధించి సమగ్ర విచారణ జరపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

Vande Bharat Express: గత రెండు రోజులుగా..

గత రెండు రోజులుగా ముంబై - గాంధీనగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు స్వల్ప ప్రమాదాాలు జరిగాయి. గురువారం ఈ రైలు ఒక గేదెల మందను ఢీ కొనడంతో ఫ్రంట్ పానెల్ పూర్తిగా ధ్వంసమైంది. నాలుగు గేదెలు మరణించాయి. ఆ ప్యానెల్ ను రీ ప్లేస్ చేశారు. అనంతరం, శుక్రవారం గుజరాత్ లోని ఆనంద్ స్టేషన్ సమీపంలో ఈ రైలు ఒక ఆవును ఢీ కొన్నది. ఈ ఘటనలో రైలు ఫ్రంట్ ప్యానెల్ కు స్వల్పంగా సొట్ట పడింది. ఈ నేపథ్యంలో, ముంబై, గాంధీనగర్ మధ్య రైలు పట్టాల పక్కన పశువులు పట్టాల పైకి రాకుండా, ఫెన్సింగ్ వేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది.

IPL_Entry_Point