Vande Bharat train hits cow now: ఆవును ఢీ కొట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్-vande bharat train hits cow in gujarat second such incident in two days
Telugu News  /  National International  /  Vande Bharat Train Hits Cow In Gujarat; Second Such Incident In Two Days
ప్రమాదంలో స్వల్పంగా ధ్వంసమైన రైలు ఫ్రంట్ ప్యానెల్
ప్రమాదంలో స్వల్పంగా ధ్వంసమైన రైలు ఫ్రంట్ ప్యానెల్

Vande Bharat train hits cow now: ఆవును ఢీ కొట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్

07 October 2022, 22:14 ISTHT Telugu Desk
07 October 2022, 22:14 IST

Vande Bharat train hits cow now: ముంబై నుంచి గుజరాత్ లోని గాంధీ నగర్ కు వెళ్లే సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలు ‘వందేభారత్ ఎక్స్ ప్రెస్’ మరోసారి స్వల్ప ప్రమాదానికి గురైంది.

Vande Bharat train hits cow now: ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ముహూర్తం సరిగ్గా కుదరనట్లుంది. ఈ ఎక్స్ ప్రెస్ రైలు శుక్రవారం గుజరాత్ లో స్వల్ప ప్రమాదానికి గురైంది. గుజరాత్ లోని ఆనంద్ స్టేషన్ కు దగ్గరలో ఒక ఆవును ఢీ కొన్నది.

Vande Bharat train hits cow now: ఫ్రంట్ పానెల్ డ్యామేజ్

శుక్రవారం ఉదయం గుజరాత్ లోని కంజారీ, ఆనంద్ స్టేషన్ల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఒక ఆవును ఢీ కొన్నది. ఈ ఘటనలో రైలు ఫ్రంట్ ప్యానెల్ స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని రైల్వే శాఖ వెల్లడించింది. ప్రమాదం జరిగిన 10 నిమిషాల తరువాత వందేభారత్ ఎక్స్ ప్రెస్ తిరిగి ప్రయాణం కొనసాగించింది.

Vande Bharat train hits cow now: రెండో ప్రమాదం..

వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడం వరుసగా ఇది రెండో రోజు. గురువారం గుజరాత్ లోనే ఒక గేదెల మందను ఢీ కొనడంతో రైలు ఫ్రంట్ ప్యానెల్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ తరువాత దానిని రీప్లేస్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రమాదంలో నాలుగు గేదెలు చనిపోయాయి. అయితే, ట్రాక్స్ పై పశువులను రైళ్లు ఢీకొనడం సాధారణమేనని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ వ్యాఖ్యానించారు.