Twitter Layoffs : ట్విట్టర్​లో ఉద్యోగం పోయింది.. ‘వీసా’ భయం పట్టుకుంది!-twitter layoffs cause of concern for h 1b visa holders says report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Twitter Layoffs Cause Of Concern For H-1b Visa Holders, Says Report

Twitter Layoffs : ట్విట్టర్​లో ఉద్యోగం పోయింది.. ‘వీసా’ భయం పట్టుకుంది!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 06, 2022 02:13 PM IST

Twitter Layoffs : హెచ్​ 1బీ వీసాలపై ట్విట్టర్​లో ఇంత కాలం పనిచేసి, తాజాగా ఉద్యోగం కోల్పోయిన వారికి మరో సమస్య వచ్చి పడింది! అదేంటంటే..

ట్విట్టర్​లో ఉద్యోగం పోయింది.. ‘వీసా’ భయం పట్టుకుంది!
ట్విట్టర్​లో ఉద్యోగం పోయింది.. ‘వీసా’ భయం పట్టుకుంది! (AP)

Twitter Layoffs : ఎలాన్​ మస్క్​ టేకోవర్​ తర్వాత.. ట్విట్టర్​లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉద్యోగంలో ఎవరు ఉంటారో? ఎవరి ఉద్యోగాలు ఊడిపోతాయో తెలియక ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. వీటన్నింటి మధ్య.. విదేశాల నుంచి వచ్చి ట్విట్టర్​లో పని చేస్తున్న వారి మనోవేదన ఇంకో ఎత్తు! త్వరలో వేరే ఉద్యోగం వెతుక్కోకపోతే.. వీరు తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిందే..!

ట్రెండింగ్ వార్తలు

హెచ్​ 1బీ వీసా నిబంధనల ప్రకారం..

కాస్ట్​ కటింగ్​ పేరుతో ట్విట్టర్​లో ఉద్యోగాల కోతను తీవ్రస్థాయిలో చేపట్టారు ఎలాన్​ మస్క్​. ముఖ్యంగా అమెరికాలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.

Twitter Layoffs H 1B visa : దేశంలో పనిచేసేందుకు అమెరికా ప్రభుత్వం హెచ్​-1బీ, ఎల్​-1, ఓ-1 వీసాలు ఇస్తుంది. ఒక్కో వీసాకు ఒక్కో పద్ధతి, ఒక్కో నిబంధన ఉంటుంది. అమెరికాలోని ఏదైనా సంస్థలో ఉద్యోగం లభిస్తేనే ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ సైతం.. హెచ్​ 1బీ వీసాపైనే.. దశాబ్దాల క్రితం అమెరికాలో అడుగుపెట్టారు.

భారతీయులతో కలిపి ప్రతియేటా లక్షలాది మంది విదేశీయులు ఈ హెచ్​- 1బీ వీసాపై అమెరికాకు వెళుతూ ఉంటారు. అయితే.. ఈ హెచ్​-1బీ వీసాలో ఒక నిబంధన ఉంది. ఉద్యోగం కోల్పోతే.. 60 రోజుల వ్యవధిలో మరో జాబ్​ దొరకకపోతే వీరు.. దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలి!

H 1B visa America : ఎలాన్​ మస్క్​ రాక ముందు వరకు ట్విట్టర్​లో 7,500కుపైగా మంది ఉద్యోగులు ఉండేవారు. వీరిలో 700మంది వరకు విదేశీయులు ఉంటారు. వీరిలో ఎంత మందికి ఉద్యోగాలు ఉన్నాయి? ఎంత మంది జాబ్స్​ కోల్పోయారు? అన్న విషయంపై స్పష్టత లేదు. కానీ ట్విట్టర్​ ఉద్యోగాల కోత చూస్తే.. పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఈ క్రమంలో.. విదేశీయులు తొందరగా వేరే ఉద్యోగం వెత్తుకోవాల్సిందే.

"ఉద్యోగం టర్మినేట్​ అయిపోతే.. ఈ వ్యక్తి 60రోజుల గ్రేస్​ పీరియడ్​లో ఉంటారు. వీసా స్టేటస్​ను మార్చుకోవాలి. లేదా వేరే సంస్థ.. ఈ వ్యక్తి తరపున హెచ్​-1బీ పిటిషన్​ ఫైల్​ చేయాలి. లేకపోతే.. సంబంధిత వ్యక్తి వీసా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టే. ఈ వార్షిక ఏడాదిలో ఈ వ్యక్తి హెచ్​ 1బీ కోటాలో ఉన్నట్టు లెక్కించేశారు కాబట్టి.. సంస్థకు పెద్ద ఇబ్బందులు ఉండవు," అని ఓ అధికారి వెల్లడించారు.

H 1B Visa Twitter employees : ఉద్యోగులను తొలగించిన సంస్థలు.. అందుకు గల కారణాలతో వెంటనే యూఎస్​ సిటిజెన్​షిప్​ అండ్​ ఇమ్మిగ్రేషన్​ సర్వీసెస్​ విభాగానికి నోటిఫై చేయాలి. వ్యవధి కన్నా ముందే ఉద్యోగిని తొలగిస్తే.. ఆ వ్యక్తి.. తన దేశానికి తిరిగి వెళ్లే ఖర్చులను సంబంధిత సంస్థే భరించాల్సి ఉంటుంది. లేకపోతే సంస్థలపైనా భారీగా జరిమానా పడే అవకాశం ఉంటుంది.

స్వచ్ఛందంగా రాజీనామా చేసి బయటకొస్తే మాత్రం.. ఇవి వర్తించవు.

IPL_Entry_Point

సంబంధిత కథనం