Ban on mobile phones in temples : రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో.. సెల్​ఫోన్​లపై నిషేధం!-tamil nadu bans mobile phones inside temple premises ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Tamil Nadu Bans Mobile Phones Inside Temple Premises

Ban on mobile phones in temples : రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో.. సెల్​ఫోన్​లపై నిషేధం!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 03, 2022 01:59 PM IST

Ban on mobile phones in temples : తమిళనాడు ఆలయాల్లో సెల్​ఫోన్​లపై నిషేధం విధించాలని మద్రాసు హైకోర్టుకు చెందిన మధురై బెంచ్​ ఆదేశాలిచ్చింది. ఆలయాల పవిత్రత, స్వచ్ఛతను పరిరక్షించేందుకు.. సెల్​ఫోన్​లపై నిషేధం విధించాలని పేర్కొంది.

రాష్ట్రంలోని ఆలయాల్లో.. మొబైల్​ ఫోన్స్​పై నిషేధం
రాష్ట్రంలోని ఆలయాల్లో.. మొబైల్​ ఫోన్స్​పై నిషేధం

Ban on mobile phones in temples : తమిళనాడు ప్రభుత్వం.. రాష్ట్రంలోని అన్ని ఆలయ ప్రాంగణాల్లో సెల్​ఫోన్ వినియోగంపై నిషేధం విధించనుంది. ఈ మేరకు.. మద్రాసు హైకోర్టుకు చెందిన మధురై బెంచ్​.. కమిషనర్​ ఆఫ్​ హిందూ రిలీజియస్​ అండ్​ ఛారిటీస్​ ఎన్​డోమెంట్స్​ డిపార్ట్​మెంట్​(హెచ్​ఆర్​ అండ్​ సీఈ)కు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులోని ఆలయాల పవిత్రత, స్వచ్ఛతను పరిరక్షించేందుకు.. సెల్​ఫోన్​లపై నిషేధం విధించాలని స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

తిరుచెందూర్​లోని అరుల్​మిగు సుబ్రహ్మణియ స్వామి ఆలయంలో సెల్​ఫోన్​లపై నిషేధం విధించాలని.. సీతారామన్​ అనే వ్యక్తి పిల్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ మేరకు తీర్పును వెలువరించింది.

Ban on phones in temples : "భక్తుల భద్రత, ఆలయాల పవిత్రను కాపాడేందుకు.. దేవాలయాల ప్రాంగణంలో సెల్​ఫోన్​ వినియోగాన్ని నిషేధించాలి. ఈ బాధ్యతను ఆలయ సిబ్బంది కఠినంగా పాటించాలి. సెల్​ఫోన్​లు, కెమెరాలు వాడుతుంటే.. భక్తులు శ్రద్ధతో ఉండటం లేదు," అని జస్టిస్​ ఆర్​ మాహదేవన్​, జస్టిస్​ జే సత్యనారాయణ ప్రసాద్​లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.

తమిళనాడులోని ముధరై మీనాక్షి ఆలయం, గురువాయూర్​లోని శ్రీ కృష్ణాలయంతో పాటు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సెల్​ఫోన్​ వినియోగంపై నిషేధం.

సెల్​ఫోన్​పై నిషేధంతో పాటు.. ఆలయాల్లో సరైన డ్రెస్​ కోడ్​ను అనుసరించే విధంగా చర్యలు చేపట్టాలని హెచ్​ఆర్​ ఎండ్​ సీఈకి ఆదేశాలిచ్చింది బెంచ్​.

ఆలయాల్లో వైద్య కేంద్రాలు..

మరోవైపు.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​ శుక్రవారం.. ఐదు ఆలయాల్లో వైద్య కేంద్రాలను ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్ధం ఇవి ఉపయోగపడనున్నాయి.

మధురై మీనాక్షి ఆలయం, ఇరుక్కన్​కుడి మరియమ్మ ఆలయం, బన్నరియమ్మ ఆలయం, మధురై కల్లర్గడ్​ ఆలయం, శంకరనారాయణ స్వామి ఆలయాల్లో వైద్య సేవలను ప్రారంభించారు. వీటితో పాటు గతేడాది 10 ఆలయాల్లో వైద్య సేవలను మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

IPL_Entry_Point

సంబంధిత కథనం