Spy pigeon: కెమెరా, జీపీఎస్ మైక్రో చిప్ తో గూఢచారి పావురం..-suspected spy pigeon with devices fitted on leg caught in odisha ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Suspected Spy Pigeon With Devices Fitted On Leg Caught In Odisha

Spy pigeon: కెమెరా, జీపీఎస్ మైక్రో చిప్ తో గూఢచారి పావురం..

HT Telugu Desk HT Telugu
Mar 09, 2023 10:00 AM IST

Spy pigeon: ఒడిశా తీరంలో ఒక గూఢచారి పావురాన్ని పట్టుకున్నారు. ఆ పావురానికి ఒక చిన్న కెమెరాను, మైక్రో చిప్ ను అమర్చి ఉన్నట్లు గుర్తించారు.

గూఢచారి పావురం, ఆ పావురం కాళ్లకు కట్టిన కెమెరా
గూఢచారి పావురం, ఆ పావురం కాళ్లకు కట్టిన కెమెరా

ఒడిశాలోని పారదీప్ తీరంలో ఒక గూఢచారి పావురాన్ని పట్టుకున్నారు. ఆ పావురానికి ఒక చిన్న కెమెరాను, జీపీఎస్ మైక్రో చిప్ ను అమర్చి ఉన్నట్లు గుర్తించారు. ఒడిశాలోని జగత్ సింగ్ పూర్ జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో ఒక ఫిషింగ్ బోట్ పై వాలిన ఈ పావురాన్ని చూసి, అనుమానాస్పదంగా ఉండడాన్నిగుర్తించి పట్టుకున్నారు.

Spy pigeon: గూఢచర్యం కోసమేనా..

ఒడిశా తీరంలో చేపల వేటకు వెళ్లిన ఒక బోటులో ఈ పావురాన్ని జాలర్లు గుర్తించారు. ఆ పావురం కాళ్లకు కెమెరా లాంటి వస్తువు కట్టి ఉండడాన్ని గమనించి, వెంటనే ఆ పావురాన్ని పట్టుకుని, తీర గస్తీ దళానికి అప్పగించారు. వైద్యులు ఆ పావురాన్ని పరీక్షిస్తున్నారని, పావురం కాళ్లకు కట్టిన వస్తువులను పరిశీలించడానికి ఫొరెన్సిక్ నిపుణుల సాయం తీసుకుంటామని జగత్ సింగ్ పూర్ ఎస్పీ రాహుల్ తెలిపారు. ఆ పావురం కాళ్లకు కట్టిన వస్తువులను ఒకటి చిన్న కెమెరా, మరొకటి మైక్రో చిప్ గా భావిస్తున్నామని, గూఢ చర్యం కోసం ప్రయోగించిన పావురంగా దీనిని ప్రాథమికంగా అనుమానిస్తున్నామని వెల్లడించారు.

code language: రెక్కల పై కూడా రాతలు..

ఆ అనుమానాస్పద పావురం రెక్కలపై కూడా స్థానిక పోలీసులు గుర్తించలేని భాషలో రెడ్, బ్లూ రంగుల్లో ఏదో రాసి ఉండడాన్ని కూడా గుర్తించారు. అది కోడ్ లాంగ్వేజ్ అయ్యే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. ఆ భాష ఏమిటనే విషయంలో, పావురం రెక్కలపై ఏం రాసి ఉందనే విషయంపై నిపుణుల సాయం తీసుకుంటున్నామని ఎస్పీ రాహుల్ వివరించారు. కాళ్లకు కెమెరా వంటి వస్తువు కట్టి ఉండడంతో పాటు అది సాధారణ పావురాల మాదిరిగా కనిపించకపోవడంతో దాన్ని పట్టుకుని తీర ప్రాంత గస్తీ దళానికి అప్పగించామని ఆ గూఢచారి పావురాన్ని పట్టుకున్న పీతాంబర్ బెహరా తెలిపారు.

IPL_Entry_Point