Supreme court on demonetisation : ‘నోట్ల రద్దు సరైనదే’- సుప్రీంకోర్టు కీలక తీర్పు-supreme court upholds the decision of the central government taken in 2016 to demonetise ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court On Demonetisation : ‘నోట్ల రద్దు సరైనదే’- సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme court on demonetisation : ‘నోట్ల రద్దు సరైనదే’- సుప్రీంకోర్టు కీలక తీర్పు

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 02, 2023 11:56 AM IST

Supreme verdict court on demonetisation : నోట్ల రద్దు వ్యవహారంపై కీలక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. కేంద్రం చేపట్టిన నోట్లరద్దు సరైనదే అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.

సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు (HT_PRINT)

Supreme verdict court on demonetisation : 2016 నవంబర్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సరైనదే అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ అనంతరం 4:1తో ఈ తీర్పును వెలువరించింది ఐదుగురు సభ్యుల ధర్మాసనం. ఆయా పిటిషన్లను కొట్టివేసింది.

'అది సరైన నిర్ణయమే..'

నోట్ల రద్దు ప్రక్రియను కేంద్రమే మొదలుపెట్టిందన్న కారణంతో దానిని వ్యతిరేకించలేమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు ఇచ్చిన 52రోజుల గడువు కూడా సమంజసంగానే ఉందని అభిప్రాయపడింది.

Demonetisation Supreme court :  "నోట్ల రద్దు కోసం ఆర్​బీఐను కేంద్రం సంప్రదించాల్సి ఉంది. 2-6 నెలల వరకు ఈ విషయంపై ఆర్​బీఐతో చర్చలు జరిపినట్టు కేంద్రం చెబుతోంది. అలాంటప్పుడు సమస్య ఏం ఉంది? నోట్ల రద్దు నిర్ణయం సరైనదే," అని.. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోని నలుగురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అయితే.. ధర్మాసనంలోని జస్టిస్​ బీవీ నాగరత్న మాత్రం కేంద్రం నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. నోట్ల రద్దు అనేది.. ప్రభుత్వ నిర్ణయంతో కాకుండా.. పార్లమెంట్​ ద్వారా చేపట్టి ఉండాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

2016 నవంబర్​లో రూ. 1000, రూ. 500 కరెన్సీ నోట్లను రద్దు చేసింది కేంద్రం. నాడు ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫలితంగా రాత్రికి రాత్రే.. రూ. 10లక్షల కోట్ల సంపద సర్క్యులేషన్​ నుంచి తుడిచిపెట్టుకుపోయింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 58 పిటిషన్లు దాఖలయ్యాయి. నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకునే అర్హత ప్రభుత్వానికి లేదని, అందుకే దానిని కొట్టివేయాలని పిటిషనర్లు వాదించారు. నోట్ల రద్దు గడిచిపోయిన అంశం అని, ఫలితంగా.. ఉపశమనం కలిగించేందుకు వీలు లేని అంశాలపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కేంద్రం వ్యాఖ్యానించింది. ఇలా చేస్తే కాలాన్ని వెనక్కి తిప్పినట్టే అవుతుందని పేర్కొంది. దేశంలో పేరుకుపోయిన నల్ల ధనం, ఫేక్​ మనీ, ఉగ్రవాదం కోసం వినియోగిస్తున్న నిధులు, పన్ను ఎగవేతతో దాచుకున్న సొమ్ము తుడిచిపెట్టుకోపాయయని వ్యాఖ్యానించింది.

Demonetisation judgement : 58 పిటిషన్లపై గత కొంతకాలంగా విచారణ జరుపుతోంది జస్టిస్​ ఎస్​ఏ నాజీర్​ నేతృత్వంలోని ధర్మాసనం. శీతాకాల సెలవులకు ముందు తీర్పును రిజర్వ్​లో పెట్టింది. తాజాగా తీర్పును వెలువరించింది. ఈ ధర్మాసనంలో.. జస్టిస్​ ఏఎస్​నాజీర్​, జస్టిస్​ నాగరత్నతో పాటు జస్టిస్​ బీఆర్​ గవాయ్​, జస్టిస్​ ఏఎస్​ బోపన్న, జస్టిస్​ వీ రామసుబ్రమణ్యం కూడా ఉన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం