Sukesh Chandrashekhar: ‘ఆప్ నాయకులకు అరవై కోట్లు ఇచ్చిన..’-sukesh chandrashekhar claims he gave rs 60 crore to aap probe likely ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sukesh Chandrashekhar Claims He Gave <Span Class='webrupee'>₹</span>60 Crore To Aap; Probe Likely

Sukesh Chandrashekhar: ‘ఆప్ నాయకులకు అరవై కోట్లు ఇచ్చిన..’

HT Telugu Desk HT Telugu
Dec 20, 2022 10:08 PM IST

Sukesh Chandrashekhar allegations on AAP: ఆమ్ ఆద్మీ పార్టీ కి రూ. 60 కోట్లు ఇచ్చానని బెదిరింపు వసూళ్ల కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి ఆరోపించాడు.

సుకేశ్ చంద్ర శేఖర్(ఆరెంజ్ స్వెటర్ లో ఉన్న వ్యక్తి) ను కోర్టుకు తీసుకువెళ్తున్న అధికారులు
సుకేశ్ చంద్ర శేఖర్(ఆరెంజ్ స్వెటర్ లో ఉన్న వ్యక్తి) ను కోర్టుకు తీసుకువెళ్తున్న అధికారులు (Vipin Kumar/HT photo)

Sukesh Chandrashekhar allegations on AAP: రూ. 200 కోట్లకు పైగా బెదిరింపు వసూళ్లకు పాల్పడిన కేసుతో పాటు, మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్ర శేఖర్ మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం సుకేశ్ తిహార్ జైళ్లో ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Sukesh Chandrashekhar allegations on AAP: 60 కోట్లు ఇచ్చిన..

జైళ్లో తనకు భద్రత కల్పించడం కోసం ఆప్ నేత, నాటి జైళ్ల శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కు రూ. 10కోట్లు ఇచ్చానని సుకేశ్ మరోసారి ఆరోపణలు చేశాడు. అలాగే, అప్పటి జైళ్ల శాఖ డెరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ కు రూ. 12.50 కోట్లు ఇచ్చానన్నాడు. ఇవి కాకుండా, రాజ్య సభ సభ్యత్వం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 50 కోట్లు ఇచ్చానని మరోసారి ఆరోపణలు చేశాడు. తాజాగా ఈ ఆరోపణలను ఈ అంశంపై విచారణ జరుపుతున్న ఉన్నత స్థాయి కమిటీ ముందు కూడా పునరుద్ఘాటించాడు. ఈ విషయాన్ని సుకేశ్ న్యాయవాది అనంత్ మాలిక్ మీడియాకు వెల్లడించాడు.

Sukesh Chandrashekhar allegations on AAP: సుకేశ్ ఆరోపణలపై దర్యాప్తు

సుకేశ్ ఆప్ పై చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, అవి విచారణార్హమైనవని, అందువల్ల వాటిపై లోతైన విచారణ జరపాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించిందని మాలిక్ వెల్లడించాడు. గతంలో, ఇవే ఆరోపణలను ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా నేతృత్వంలోని కమిటీ ముందు కూడా సుకేశ్ చేశారు. సుకేశ్ అక్రమంగా సంపాదించిన డబ్బు నుంచి ఖరీదైన బహుమతులు స్వీకరించారన్న ఆరోపణలపై బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలను కూడా ఈడీ విచారించింది.

AAP responds to Sukesh allegations: బీజేపీలో చేరుతాడు..

సుకేశ్ చంద్ర శేఖర్ ఆరోపణలపై ఆప్ గతంలోనే స్పందించింది. అతడు తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి అని, అలాంటి వాడి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. సుకేశ్ బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నాడని, జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత అతడు బీజేపీలో చేరడం ఖాయమని వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది.

IPL_Entry_Point

టాపిక్