Bengal Stampede news: బీజేపీ బ్లాంకెట్ల పంపిణీలో తొక్కిసలాట; ముగ్గురు మృతి-stampede in blanket distribution programme 3 killed in west bengal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Stampede In Blanket Distribution Programme, 3 Killed In West Bengal

Bengal Stampede news: బీజేపీ బ్లాంకెట్ల పంపిణీలో తొక్కిసలాట; ముగ్గురు మృతి

HT Telugu Desk HT Telugu
Dec 14, 2022 10:35 PM IST

Bengal Stampede news: పశ్చిమ బెంగాల్ లో చలికాలం సందర్భంగా పేదలకు దుప్పట్లు పంచే కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Bengal Stampede news: పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ వర్ధమాన్ జిల్లాలో ఉన్న అసన్ సోల్ లో బుధవారం బీజేపీ నేతలు పేదలకు దుప్పట్లను పంచే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సుదేంధు అధికారి హాజరయ్యారు.

Blanket distribution programme of BJP: తొక్కిసలాట

దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగానే, ఒక్కసారిగా అక్కడికి వచ్చిన పేదలు దుప్పట్లను పంచుతున్న వేదిక వద్దకు పెద్దఎత్తున తోసుకు రావడం ప్రారంభించారు. దాంతో, అక్కడ తోక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కింద పడిపోయి, పలువురు గాయాల పాలయ్యారు. కింద పడిపోయి,శ్వాస అందక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. సుదేంధు అధికారి అక్కడ నుంచి వెళ్లగానే ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ కార్యక్రమం కోసం తమ నుంచి అనుమతి తీసుకోలేదని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు. బీజేపీ బాధ్యతారాహిత్యం వల్లనే ఈ తొక్కిసలాట చోటు చేసుకుందని అధికార టీఎంసీ ఆరోపించింది. కనీస జాగ్రత్తలు కానీ, అవసరమైన అనుమతులు కానీ తీసుకోకుండా, ఈ కార్యక్రమం చేపట్టారని విమర్శించింది. అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచలేదని పేర్కొంది. బీజేపీ నేత సువేందు అధికారి ఈ ప్రమాదానికి బాధ్యత తీసుకుని, తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు.

IPL_Entry_Point