Sikkim news: పిల్లలను కనాలనుకునే ప్రభుత్వ ఉద్యోగినులకు వరాల జల్లు-sikkim govt women employees to get childcare attendants at home to take care of newborns cm ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sikkim Govt Women Employees To Get Childcare Attendants At Home To Take Care Of Newborns: Cm

Sikkim news: పిల్లలను కనాలనుకునే ప్రభుత్వ ఉద్యోగినులకు వరాల జల్లు

HT Telugu Desk HT Telugu
Jan 21, 2023 10:30 PM IST

Sikkim news: జనాభాను పెంచడం కోసం సిక్కిం ప్రభుత్వం వినూత్న పథకాలకు రూపకల్పన చేస్తోంది. రాష్ట్ర జనాభా వృద్ధి కోసం పలు చర్యలు చేపడ్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

low fertility rate in Sikkim: సిక్కింలో జనాభాను పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగినులకు పలు ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

low fertility rate in Sikkim: ఉచితంగా సహాయకురాలు

పిల్లలను కనాలని నిర్ణయించుకున్న ప్రభుత్వ ఉద్యోగినులకు డెలివరీ అనంతరం ఇంట్లో నవజాత శిశువులను (newborns) సంవత్సరం పాటు చూసుకోవడానికి ఉచితంగా సహాయకురాళ్లను (childcare attendants) ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ శనివారం ప్రకటించారు. ఇందుకోసం 40 ఏళ్ల వయస్సు పై బడిన మహిళలను రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగినులు డెలివరీ అయిన తరువాత, నవజాత శిశువుల బాగోగులను ఈ సహాయకురాళ్లు సంవత్సరం పాటు చూసుకుంటారని వివరించారు. ఇందుకు ఈ సహాయకురాళ్లకు (childcare attendants) నెలకు రూ. 10 వేల వేతనం అందిస్తామన్నారు. ‘సిక్కింలో సంతానోత్పత్తి రేటు (low fertility rate) చాలా తక్కువగా ఉంది. ఇది చాలా ఆందోళనకర విషయం. ఈ సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని తమంగ్ వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే, సంతానోత్పత్తికి సిద్ధపడిన మహిళా ఉద్యోగులకు అన్ని విధాలా సహాయపడాలని నిర్ణయించామన్నారు.

low fertility rate in Sikkim: సంవత్సరం ప్రసూతి సెలవులు

సంతానోత్పత్తికి సిద్ధపడిన మహిళా ఉద్యోగులకు అన్ని విధాలా సహాయపడాలనే ఉద్దేశంతో సిక్కిం ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. సిక్కిం స్థానిక మహిళలు సంతానోత్పత్తికి సిద్ధపడేలా చర్యలు తీసుకుంటోంది. స్థానిక వర్గాలు, తెగల జనాభాను పెంచడానికి ఆ మహిళలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే, వారు ప్రభుత్వ ఉద్యోగినులైతే, వారికి సంవత్సరం పాటు ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ ఉద్యోగిన భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే, అతడికి 30 రోజుల పెటర్నిటీ లీవ్ ఇవ్వనుంది. అంతేకాదు, రెండో బిడ్డను కంటే ఒక ఇంక్రిమెంట్ ను, మూడో బిడ్డను కంటే రెండు ఇంక్రిమెంట్లను ఇస్తామని ప్రకటించింది. ఉద్యోగులే కాకుండా, సాధారణ మహిళలు కూడా ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వడానికి ఆర్థిక ప్రోత్సాహకాలను ఇస్తామని సీఎం తమంగ్ ప్రకటించారు. గర్భధారణ లో ఇబ్బంది పడుతున్న మహిళల కోసం ఐవీఎఫ్ కేంద్రాలను (IVF facility) ఏర్పాటు చేశామన్నారు. ఐవీఎఫ్ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన మహిళలకు రూ. 3 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామన్నారు. ప్రస్తుతం సిక్కిం జనాభా 7 లక్షల కన్నా తక్కువే. వీరిలో 80% స్థానిక వర్గాలు, తెగలే. వీరిలో సంతానోత్పత్తి రేటు 1.1% మాత్రమే ఉంది.

IPL_Entry_Point