Shriram City Union Finance FD: శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ఎఫ్‌డీ రేట్ల పెంపు-shriram city union finance raises fd interest rates by up to 50bps ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Shriram City Union Finance Raises Fd Interest Rates By Up To 50bps

Shriram City Union Finance FD: శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ఎఫ్‌డీ రేట్ల పెంపు

HT Telugu Desk HT Telugu
Aug 10, 2022 02:40 PM IST

Shriram City Union Finance FD: శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ రేట్లు పెంచింది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డ రేట్లు పెంచిన శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డ రేట్లు పెంచిన శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్

న్యూఢిల్లీ: శ్రీరామ్ గ్రూప్ అనుబంధ సంస్థ శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ (శ్రీరామ్ సిటీ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రేట్లను 25-50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చిన్న వ్యాపారాలకు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లకు రుణాలు ఇస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి.

కంపెనీ 12 నెలలు, 36 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 0.25 శాతం మేర వడ్డీ రేట్లు పెంచింది. అయితే 24 నెలల కాలపరిమితితో ఉన్న వాటిపై 0.50 శాతం మేర వడ్డీ రేట్లు పెరిగాయి. 48 నెలలు, 60 నెలల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 0.35 శాతం మేర పెరిగింది.

<p>వివిధ కాలపరిమితులతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు</p>
వివిధ కాలపరిమితులతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు
<p>ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు</p>
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు

సీనియర్ సిటిజన్ డిపాజిటర్లకు 0.50 శాతం మేర అదనపు వడ్డీ చెల్లించనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. డిపాజిట్ మెచ్యూర్ అయిన అన్ని రెన్యువల్స్‌పై అదనంగా 0.25 శాతం మేర వడ్డీ చెల్లించనున్నట్టు తెలిపింది.

IPL_Entry_Point