PM KISAN 13th Installment : పీఎం కిసాన్​ 13వ విడత నిధులు విడుదల-pm kisan scheme centre releases 13th installment of 16 800 crores ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Pm Kisan Scheme Centre Releases 13th Installment Of 16,800 Crores

PM KISAN 13th Installment : పీఎం కిసాన్​ 13వ విడత నిధులు విడుదల

Sharath Chitturi HT Telugu
Feb 27, 2023 09:41 PM IST

PM KISAN 13th Installment release : పీఎం కిసాన్​ 13వ విడత నిధులు సోమవారం విడుదలయ్యాయి. ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేశారు. ఈ సారి దాదాపు 8కోట్ల మంది లబ్ధిపొందనున్నారు.

పీఎం కిసాన్​ 13వ విడత నిధులు విడుదల
పీఎం కిసాన్​ 13వ విడత నిధులు విడుదల

PM KISAN 13th Installment released : పీఎం కిసాన్​ 13వ విడత నిధులను సోమవారం విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ దఫాలో మొత్తం మీద రూ. 16,800కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. దాదాపు 8కోట్ల మంది లబ్ధిదారులకు.. హోలీ, రబీ సీజన్​కు ముందే ప్రత్యక్షంగా బ్యాంకు ఖాతాల్లోకి నిధులు చేరతాయని ప్రభుత్వం చెప్పింది.

కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. బెళగావీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పీఎం కిసాన్​ 13వ విడత నిధులను విడుదల చేశారు. ఈ ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధిలో భాగంగా.. లబ్ధిదారులకు వార్షికంగా రూ. 6వేలు అందుతాయి. ఏడాది పొడవునా మూడు విడతల్లో రూ. 2వేలు చేరతాయి. పీఎం కిసాన్​ 11, 12 విడతల నిధులు గతేడాది మే, అక్టోబర్​లో విడుదలయ్యాయి.

PM KISAN 13th Installment date 2023 : కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ ప్రకారం.. పీఎం కిసాన్​ పథకంతో ఇప్పటివరకు 11కోట్లకుపైగా అన్నదాత కుటుంబాలు లబ్ధిపొందాయి. రూ. 2.25లక్షల కోట్ల నిధులు రైతులకు చేరాయి. ఒక్క కొవిడ్​ సంక్షోభంలోనే రైతులకు రూ 1.75లక్షల కోట్ల డబ్బులు అందాయి. ఇక ఈ పథకంలో భాగంగా 3కోట్లకుపైగా మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 53,600కోట్లు పడ్డాయి.

2019లో పీఎం కిసాన్​ పథకాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా వ్యవసాయ భూములు ఉన్న రైతులందరికి ఆర్థికంగా మద్దతిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈ నిధులతో రైతులు.. తమ పొలానికి సంబంధించిన అవసరాలను తీర్చుకోవడంతో పాటు, విద్య, పెళ్లి, వైద్యం వంటివి కూడా సమకూర్చుకోవచ్చు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్టేటస్ చెక్ చేసుకోండిలా..

స్టెప్​ 1:- ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‍సైట్ https://pmkisan.gov.in/ లోకి వెళ్లాలి

స్టెప్​ 2:- అనంతరం హోమ్‍పేజీలోని ఫార్మర్స్ కార్నర్ (Formers Corner) సెక్షన్ కింద బెనిఫిషియరీ స్టేటస్ (Beneficiary Status) అనే ఆప్షన్‍పై క్లిక్ చేయండి

PM KISAN 13th Installment : స్టెప్​ 3:- అక్కడ మీ పీఎం-కిసాన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి

స్టెప్​ 4:- అనంతరం గెట్ డేటా ఆప్షన్‍పై క్లిక్ చేయండి

స్టెప్​ 5:- అప్పుడు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మీ స్టేటస్ స్క్రీన్‍పై కనిపిస్తుంది

స్టెప్​ 6:- దాన్ని డౌన్‍లోడ్ చేసుకొని, సేవ్ చేసుకోండి

మీ ఖాతాలో డబ్బు క్రిడెట్ అయితే చూపిస్తుంది. ఒకవేళ డబ్బు జమ కాకపోతే కారణాన్ని కూడా తెలుపుతుంది.

IPL_Entry_Point