రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలో ఖాతాల్లోకి పీఎం కిసాన్ యోజన నిధులు.. ఎప్పుడంటే?-pm kisan samman nidhi yojana this is when centre will release 11th installment ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Pm Kisan Samman Nidhi Yojana: This Is When Centre Will Release 11th Installment.

రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలో ఖాతాల్లోకి పీఎం కిసాన్ యోజన నిధులు.. ఎప్పుడంటే?

HT Telugu Desk HT Telugu
May 07, 2022 05:54 PM IST

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 11వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. ఈ పథకం ద్వారా దేశంలోని 12 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు.

PM Kisan Samman Nidhi Yojana
PM Kisan Samman Nidhi Yojana

ఇప్పటి వరకు పీఎం కిసాన్ యోజన కింద  12.53 కోట్ల మంది పైగా రైతులు అర్హులుగా ఉన్నారు. రైతులు ఈ స్కీం ద్వారా ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రూ.6000 ఆర్థిక సాయం అందుకుంటున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 10 విడతలుగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఇక  11వ విడత నిధులు ఈ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది.  

11 విడత నిధులు రైతుల ఖాతాల్లో మరో వారం రోజుల్లో జమ కానున్నట్లు తెలుస్తోంది. గత రికార్డులను పరిశీలిస్తే.. ప్రతి సంవత్సరం మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు వస్తుంది. అదే సమయంలో ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు రెండో విడత, డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు మూడో విడత రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇక ఈ పథకం ప్రయోజనాన్ని నిరంతరం పొందాలనుకుంటే వీలైనంత త్వరగా E-KYC ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

e-KYC నమోదుకు చివరి తేదీ

e-కెవైసి ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇటీవల చివరి తేదీని పొడిగించింది. మే 22, 2022 వరకు e-KYCని పూర్తి చేయవచ్చు. ఇ-కెవైసిని పూర్తి చేయకపోతే, తదుపరి విడత ఆలస్యం కావచ్చు. దాని వెంటనే కింద తెలిపిన విధంగా E-KYC ప్రక్రియను పూర్తి చేయండి.

 

ఇలా e-KYC ప్రక్రియను పూర్తి చేయండి

ముందుగా Pm kissan అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

 eKYC లింక్ కిసాన్ కార్నర్ ఆప్షన్‌ను ఎంచుకోండి. తర్వాత దానిపై క్లిక్ చేయండి.

ఆ తర్వాత మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.

అడిగిన అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి.

దీని తర్వాత submissionపై క్లిక్ చేయడం ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది.

 

మీ సెటస్‌ను ఇలా చెక్ చేసుకోండి

ముందుగా Pm kissan వెబ్‌సైట్‌కి వెళ్లండి.

ఇప్పుడు 'ఫార్మర్స్ కార్నర్' ఎంపికపై క్లిక్ చేయండి.

ఆ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్ , గ్రామం పేరు నమోదు చేయండి.

ఆ తర్వాత 'గెట్ రిపోర్ట్' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే పూర్తి జాబితా తెరవబడుతుంది.

రైతు ఈ జాబితాలో మీరు మీ ఇన్‌స్టాల్‌మెంట్ వివరాలను చూడవచ్చు.

WhatsApp channel

టాపిక్