Pak woman waited 30 years: భారతీయ భర్త కోసం పాక్ మహిళ 30 ఏళ్ల ఎదురుచూపు-pak woman waited 25 years to marry indian still awaits visa
Telugu News  /  National International  /  Pak Woman Waited 25 Years To Marry Indian; Still Awaits Visa
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Pak woman waited 30 years: భారతీయ భర్త కోసం పాక్ మహిళ 30 ఏళ్ల ఎదురుచూపు

10 March 2023, 21:43 ISTHT Telugu Desk
10 March 2023, 21:43 IST

Pak woman waited 30 years: భారతీయుడైన ఒక వ్యక్తితో జీవితం పంచుకోవడం కోసం పాకిస్తాన్ కు చెందిన ఒక మహిళ పాతికేళ్లు ఎదురు చూసింది. ఆ తరువాత, ఆమె ఆశ నెరవేరి అదే వ్యక్తితో వివాహమైనా.. భారత్ నుంచి వీసా రాకపోవడంతో, భర్తతో కలిసి జీవించడం కోసం నేటికీ ఎదురు చూస్తోంది.

భారత్ లోని రాజస్తాన్ కు చెందిన బాబు భాయి షేక్ సోదరి పాకిస్తాన్ లో ఉంటుంది. ఒకసారి ఆమె కోసం పాకిస్తాన్ వెళ్లిన బాబు భాయి షేక్క కు అక్కడే ఉండే షహీదాతో వివాహం నిశ్చయమైంది. ఇది జరిగింది 1993లో. అయితే, వీసా సమస్యతో పాటు ఇతర అనివార్య కారణాల వల్ల వారి వివాహం వాయిదా పడింది.

Pak woman waited 30 years: 1992 లో నిశ్చయం, 2017లో పెళ్లి

అయితే, భారత్ తిరిగి వచ్చిన తరువాత ఆ వివాహం ఇక సాధ్యం కాదని భావించిన బాబు భాయి షేక్.. ఇక్కడే మరో వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత, దాదాపు 15 ఏళ్ల తరువాత, 2010 లో బాబు భాయి షేక్ మళ్లీ తన చెల్లి వద్దకు పాకిస్తాన్ వెళ్లాడు. అక్కడ తన చెల్లి చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయాడు. షహీదా తన కోసం ఇంకా ఎదురుచూస్తోందని, ఎవరినీ పెళ్లి చేసుకోలేదని తన చెల్లి చెప్పిన విషయాన్ని నమ్మలేకపోయాడు. వెంటనే, తనకు వివాహమైన విషయాన్ని ఆమెకు చెప్పమని, తనను వేరే పెళ్లి చేసుకోమని చెప్పమని కోరాడు. కొద్ది రోజులకు తిరిగి భారత్ తిరిగివచ్చాడు. అయితే, షహీదా వేరే పెళ్లికి అంగీకరించడం లేదని, ఎంతకాలమైనా తన కోసమే ఎదురు చూడడానికి సిద్ధంగా ఉందని చెల్లి నుంచి సమాచారం రావడంతో, మళ్లీ పాకిస్తాన్ వెళ్లి 2017 లో ఆమెను వివాహం చేసుకున్నాడు.

Pak woman waited 30 years: వీసా కోసం ఎదురు చూపులు

అయితే, వివాహం అయిన తరువాత కూడా షహీదా కష్టాలు తీరలేదు. భర్తతో కలిసి భారత్ రావడానికి, భర్తతో కలిసి ఉండడానికి ఇంకా అవకాశం లభించలేదు. వీసా కోరుతూ భారత ప్రభుత్వానికి ఆమె పెట్టుకున్న దరఖాస్తు ఇంకా పెండింగ్ లోనే ఉంది. బీజేపీ నేత, స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి కైలాశ్ చౌధరిని బాబు భాయి షేక్ తండ్రి కలిసి షహీదాకు వీసా వచ్చేలా చూడమని అభ్యర్థించారు. విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి ఆమెకు వీసా వచ్చేలా చూస్తానని మంత్రి కైలాశ్ చౌధరి వారికి హామీ ఇచ్చారు. అవసరమైతే, విదేశాంగ మంత్రితో స్వయంగా మాట్లాడుతానన్నారు. మరో సారి ఫ్రెష్ గా వీసా కోసం దరఖాస్తు చేసుకోమని సూచించారు. ఏదేమైనా, 30 ఏళ్లుగా షహీదా ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి.

టాపిక్