Biden on Pakistan : ‘ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్​’-one of the most dangerous nations in world us president biden s candid comment on pakistan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  "One Of The Most Dangerous Nations In World..." Us President Biden's Candid Comment On Pakistan

Biden on Pakistan : ‘ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్​’

Sharath Chitturi HT Telugu
Oct 15, 2022 12:58 PM IST

Biden's candid comment on Pakistan : పాకిస్థాన్​పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాక్​ ఒకటని పేర్కొన్నారు.

జో బైడెన్​
జో బైడెన్​

Biden comments on Pakistan : పాకిస్థాన్​ను.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా అభివర్ణించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. ఏ విధమైన సమన్వయం లేకుండా, అణ్వాయుధాలు కలిగిన దేశం పాకిస్థాన్​ అని అభిప్రాయపడ్డారు.

కాలిఫోర్నియాలో జరిగిన డెమొక్రటిక్​ కాంగ్రెషనల్​ క్యాంపైన్​ కమిటీ రిసెప్షన్​లో పాల్గొన్నారు జో బైడెన్​. చైనా, రష్యాలతో పాటు పాకిస్థాన్​పైనా మండిపడ్డారు.

US Pakistan relation : చైనా, రష్యాలపై అమెరికా విదేశాంగ విధానాల గురించి మాట్లాడుతూ.. పాకిస్థాన్​పై ఈ విధంగా వ్యాఖ్యానించారు జో బైడెన్​.

"తనకేం కావాలో ఈ వ్యక్తికి(చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​) చాలా బాగా తెలుసు. కానీ ఆయనకు చాలా సమస్యలు ఉన్నాయి. దానిని మనం ఎలా హ్యాండిల్​ చేయగలం? రష్యాలో జరుగుతున్న దానితో మనం ఎలా ఉండాలి? ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాకిస్థాన్​ ఒకటని నా అభిప్రాయం. ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలు కలిగిన దేశం అది," అని బైడెన్​ మాట్లాడినట్టు శ్వేతసౌధం ఓ ప్రకటనలో పేర్కొంది.

Joe Biden latest news : అమెరికాతో గత కొన్నేళ్లుగా పాకిస్థాన్​కు సత్సంబంధాలు లేవు. అగ్రరాజ్యంతో బంధం పెంచుకోవాలని పాక్​ ప్రధాని షెహ్​బాజ్​ షరీఫ్​ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సమయంలో బైడెన్​ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. పాక్​కు మరింత కష్టాలు తెచ్చిపెట్టాయి.

21వ దశాబ్దం రెండో భాగంలో ప్రపంచాభివృద్ధికి అమెరికా తోడ్పడేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని బైడెన్​ అభిప్రాయపడ్డారు. అమెరికన్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు.

పాక్​పై కోపం ఎందుకు?

అమెరికా నేషనల్​ సెక్యూరిటీ స్ట్రాటీ నివేదిక బుధవారం విడుదలైంది. చైనా, రష్యా నుంచి వచ్చే ముప్పు గురించి ఈ 48పేజీల డాక్యుమెంట్​లో అధికారులు వివరించారు. ఇందులో పాకిస్థాన్​ పేరు లేదు. అలాంటిది, ఇప్పుడు పాక్​పై బైడెన్​ మండిపడటం సర్వత్రా చర్చకు దారితీసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం