Nobel chemistry prize: కేన్సర్ ఔషధ పరిశోధనలకు కెమిస్ట్రీ నోబెల్-nobel chemistry prize awarded to 3 for attaching molecules ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Nobel Chemistry Prize Awarded To 3 For Attaching Molecules

Nobel chemistry prize: కేన్సర్ ఔషధ పరిశోధనలకు కెమిస్ట్రీ నోబెల్

HT Telugu Desk HT Telugu
Oct 05, 2022 04:12 PM IST

Nobel chemistry prize: ఈ సంవత్సరం రసాయన శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం క్లిక్ కెమిస్ట్రీ, బయోఆర్థోగోనల్ రంగాల్లో పరిశోధనలు చేసిన ముగ్గురు పరిశోధకులకు సంయుక్తంగా దక్కింది.

నోబెల్ ప్రైజ్
నోబెల్ ప్రైజ్

Nobel chemistry prize: రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం ఈ సంవత్సరం ముగ్గురు పరిశోధకులకు సంయుక్తంగా దక్కింది. కెరొలిన్ ఆర్ బెటోజీ, మార్టెన్ మెల్డల్, కే బ్యారీషార్ప్ లెస్ లు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం సమంగా అందుతుంది. స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో ఉన్న కేరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ లో రాయల్ స్వీడిష్ ఎకాడమీ సెక్రటరీ జనరల్ హ్యాన్స్ ఎలెగ్రెన్ బుధవారం ఈ పురస్కార వివరాలను ప్రకటించారు.

Nobel chemistry prize: కేన్సర్ డ్రగ్స్ కోసం..

కేన్సర్ ఔషధాల తయారీకి, డీఎన్ఏ మ్యాపింగ్ కు ప్రత్యేక అవసరాల కోసం పదార్ధాలను రూపొందించడానికి అవసరమైన మాలిక్యూల్స్ రూపకల్పనలో ఈ శాస్త్రవేత్తలు విశేష పరిశోధనలు చేశారు.

Nobel chemistry prize: క్లిక్ కెమిస్ట్రీ

వీరు పరిశోధనలు చేసిన రసాయన శాస్త్ర విభాగాలను క్లిక్ కెమిస్ట్రీ, బయోఆర్థోగోనల్ గా పిలుస్తారు. బయోఆర్థోగోనల్ రియాక్షన్ల ద్వారా కేన్సర్ ఔషధాల తయారీకి ఉపయోగించే మాలిక్యూల్స్ ను రూపొందించడం వీరి ప్రయోగాల ద్వారా సాధ్యమైంది.

Nobel chemistry prize: సైంటిస్టుల వివరాలు..

ఈ సంవత్సరం రసాయన శాస్త్ర నోబెల్ పురస్కారం పొందిన శాస్త్రవేత్తల్లో బెటొజీ కాలిఫోర్నియాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో, మెల్డెల్ డెన్మార్క్ లోని యూనివర్సిటీ ఆఫ్ కోపెన్ హెగెన్ లో, షార్ఫ్ లెస్ కాలిఫోర్నియా లోని స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ఈ పరిశోధనలు సాగించారు. వీరిలో బ్యారీషార్ప్ లెస్ కు 2001లో కూడా నోబెల్ పురస్కారం లభించడం విశేషం. ఇలా రెండు సార్లు నోబెల్ పురస్కారం పొందిన వారిలో బ్యారీషార్ప్ లెస్ ఐదవ వారు. ఈ పురస్కారంలో భాగంగా దాదాపు 9 లక్షల డాలర్ల విలువైన 10 మిలియన్ల స్వీడిష్ క్రొనోర్ లను అందిస్తారు. డిసెంబర్ 10న ఈ పురస్కారాల ప్రదానం ఉంటుంది.

IPL_Entry_Point