NEET SS Result 2022: ఈ రోజే నీట్ ఎస్ ఎస్ రిజల్ట్స్-neet ss result 2022 to be declared today how to check other details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Ss Result 2022: ఈ రోజే నీట్ ఎస్ ఎస్ రిజల్ట్స్

NEET SS Result 2022: ఈ రోజే నీట్ ఎస్ ఎస్ రిజల్ట్స్

HT Telugu Desk HT Telugu
Sep 15, 2022 06:17 PM IST

NEET SS Result 2022: వైద్య విద్యలో సూపర్ స్పెషాలిటీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన నీట్ ఎస్ ఎస్(NEET SS) పరీక్ష ఫలితాలు సెప్టెంబర్ 15న విడుదల కానున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT)

NEET SS Result 2022: వైద్య విద్య లో సూపర్ స్పెషాలిటీ కోర్సులైన ఎండీ, ఎంఎస్, డీఎన్ బీ ల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను NBEMS(National Board of Examinations in Medical Sciences) సెప్టెంబర్ 15న విడుదల చేయనుంది. ఆ NEET SS పరీక్షకు హాజరైన వైద్య విద్యార్థులు NBE అధికారిక వెబ్ సైట్ అయిన nbe.edu.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

NEET SS Result 2022: 15 రోజుల క్రితమే పరీక్ష

నీట్ పరీక్ష ను సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించారు. సుమారు పక్షం రోజుల్లనే ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తుండడం విశేషం. అలాగే, ఇదే రోజు అడ్మిషన్ల కు సంబంధించిన కటాఫ్ మార్క్ ను కూడా విడుదల చేయనున్నారు.

NEET SS Result 2022: NEET SS ఫలితాలను ఇలా చెక్ చేసుకోవాలి

ఎన్బీఈ అధికారిక వెబ్ సైట్ nbe.edu.in ను ఓపెన్ చేయాలి.

NEET SS Result 2022 లింక్ పై క్లిక్ చేయాలి.

లాగిన్ డిటైల్స్ ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.

స్క్రీన్ పై మీ రిజల్ట్ కనిపిస్తుంది.

వివరాలు సరి చూసుకుని రిజల్ట్ పేజ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

భవిష్యత్ అవసరాల కోసం ఆ పేజ్ ను ప్రింట్ తీసుకోండి.

IPL_Entry_Point

టాపిక్