Muslim Couple Married at Temple: హిందూ దేవాలయంలో ముస్లిం జంట నిఖా.. ఎందుకంటే!-muslim couple marry in hindu temple in himachal pradesh
Telugu News  /  National International  /  Muslim Couple Marry In Hindu Temple In Himachal Pradesh
Muslim Couple Married at Temple: హిందూ దేవాలయంలో ముస్లిం జంట నిఖా.. ఎందుకంటే!
Muslim Couple Married at Temple: హిందూ దేవాలయంలో ముస్లిం జంట నిఖా.. ఎందుకంటే! (ANI Photo)

Muslim Couple Married at Temple: హిందూ దేవాలయంలో ముస్లిం జంట నిఖా.. ఎందుకంటే!

06 March 2023, 20:07 ISTChatakonda Krishna Prakash
06 March 2023, 20:07 IST

Muslim Couple Married at Hindu Temple: హిందూ దేవాలయ పరిసరాల్లో ఓ ముస్లిం జంట వివాహం జరిగింది. ముస్లిం ఆచారాల ప్రకారం ఈ పెళ్లి జరిగింది.

Muslim Couple Married at Hindu Temple: ఓ ముస్లిం జంట.. హిందూ దేవాలయ పరిసరాల్లో వివాహం చేసుకుంది. ఆలయ పరిసరాల్లో ఇస్లాం ఆచారం ప్రకారం ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. మత సామరస్యాన్ని చాటేందుకు ముస్లిం జంట ఇలా వివాహం చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‍లోని షిమ్లా (Shimla) జిల్లా రామ్‍పూర్ (Rampur) ప్రాంతంలో ఈ నిఖా (Nikah) జరిగింది.

Muslim Couple Married at Hindu Temple: రామ్‍పూర్‌లోని ఠాకూర్ సత్యనారాయణ స్వామి దేవాలయం పరిసరాల్లో విశ్వహిందూ పరిషత్ నడుపుతున్న కాంప్లెక్స్‌లో ఈ వివాహం జరిగింది. ఈ ముస్లిం జంట పెళ్లికి ముస్లింలు, హిందువులు హాజరయ్యారు. ఆ జంటను ఆశీర్వదించారు. ప్రజల మధ్య సోదరభావాన్ని పెంచేందుకు, మత సామరస్య సందేశాన్ని చాటేందుకు దేవాలయంలో నిఖా జరిపించినట్టు నిర్వాహకులు వెల్లడించారు.

ఈ కాంప్లెక్స్.. విశ్వహిందూ పరిషత్ (Vishwa Hindu Parishad), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)కు జిల్లా కార్యాలయంగా ఉండడం విశేషం.

Muslim Couple Married at Hindu Temple: సనాతన ధర్మం ప్రతీ ఒక్కరినీ స్ఫూర్తితో ముందుకు నడిపిస్తుందని ఠాకూర్ సత్యనారాయణ స్వామి టెంపుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ వినయ్ శర్మ వెల్లడించారు. “ఈ దేవాలయాన్ని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జిల్లా కార్యాలయాన్ని విశ్వ హిందూ పరిషత్ నడుపుతోంది. విశ్వహిందూ పరిషత్, ఆర్ఆర్ఎస్.. ముస్లింలకు వ్యతిరేకమని తరచూ ఆరోపణలు వస్తుంటాయి. అయితే ఇక్కడ ఓ ముస్లిం జంట.. హిందూ దేవాలయ పరిసరాల్లో వివాహం చేసుకుంది. ప్రతీ ఒక్కరితో కలిసి ముందుకు సాగేలా సనాతన ధర్మం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తి కలిగిస్తుందని చెప్పేందుకు ఇదో ఉదాహరణగా నిలిచింది” అని వినయ్ శర్మ చెప్పారు.

Muslim Couple Married at Hindu Temple: ప్రజల్లో సోదర భావాన్ని పెంచేందుకు రామ్‍పూర్ ప్రజలు ఈ వివాహంతో ఓ సందేశం పంపారని వధువు తండ్రి మహేంద్ర సింగ్ మాలిక్ అన్నారు. “రామ్‍పూర్‌లోని సత్యనారాయణ స్వామి టెంపుల్ కాంప్లెక్స్‌లో మా కూతురు వివాహం జరిగింది. నగర ప్రజలు, విశ్వ హిందూ పరిషత్, టెంపుల్ ట్రస్ట్.. ఇలా అందరూ ఎంతో ఉత్సాహంగా, సానుకూలంగా ఈ వివాహాన్ని జరిపించారు” అని మాలిక్ చెప్పారు. తన కూతురు ఎం.టెక్ సివిల్ ఇంజినీరింగ్ గోల్డ్ మెడలిస్ట్ అని, తన అల్లుడు సివిల్ ఇంజినీర్ అని ఆయన తెలిపారు.