Mass wedding in Ayodhya: ఒకే సమయంలో, ఒకే వేదికపై 1300 పెళ్లిళ్లు;కట్నం లేకుండానే-more than 1 300 hindu muslim couples tie knot at mass wedding event in ayodhya ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  More Than 1,300 Hindu, Muslim Couples Tie Knot At Mass Wedding Event In Ayodhya

Mass wedding in Ayodhya: ఒకే సమయంలో, ఒకే వేదికపై 1300 పెళ్లిళ్లు;కట్నం లేకుండానే

HT Telugu Desk HT Telugu
Nov 25, 2022 09:47 PM IST

Mass wedding in Ayodhya: ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో హిందు, ముస్లింల ఐక్యతకు సూచికగా సామూహిక వివాహ మహోత్సవం జరిగింది. ఒకే సమయంలో, ఒకే వేదికలో 1300లకు పైగా హిందు, ముస్లిం జంటలు వివాహం చేసుకున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Mass wedding in Ayodhya: ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో ఈ కార్యక్రమం జరిగింది. అయోధ్య, అంబేద్కర్ నగర్ జిల్లాల్లోని జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Mass wedding in Ayodhya: సామూహిక వివాహ కార్యక్రమం

అయోధ్యలోని గవర్న్ మెంట్ ఇంటర్ కాలేజ్ గ్రౌండ్ లో శుక్రవారం ఈ వివాహ మహోత్సవం జరిగింది. ఇందులో 1342 హిందూ జంటలు, 13 ముస్లిం జంటలు వివాహం చేసుకున్నాయి. హిందూ వివాహాలను గాయత్రి పరివార్ సంస్థవారు, ముస్లిం వివాహాలను ఒక ముస్లిం ఖ్వాజీ నిర్వహించారు. కట్నం ప్రసక్తి లేకుండానే ఈ వివాహాలు జరగడం విశేషం. ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలను అందించిందని జిల్లా కలెక్టర్ నితీశ్ కుమార్ తెలిపారు.

50000 gift from govt: ప్రభుత్వం నుంచి బహుమతి

ఈ కార్యక్రమంలో వివాహం చేసుకున్న జంటలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 వేల చొప్పున నగదు బహుమానం అందించింది. వివాహ కార్యక్రమం ముగియగానే వారికి మ్యారేజ్ సర్టిఫికెట్లను కూడా అందించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ రెండో సారి సీఎం అయిన తరువాత రాష్ట్రంలోని 5 లక్షల మంది యువతుల పెళ్లిళ్లకు సహాయం చేశారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్భర్ వెల్లడించారు.

IPL_Entry_Point