President Murmu: భయం లేని సుస్థిర, నిర్ణయాత్మక ప్రభుత్వం ఇది: రాష్ట్రపతి ముర్ము
President Murmu Speech: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Modi) సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపకుండా, దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం కృష్టి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (ANI)
President Droupadi Murmu speech: సుస్థిర ప్రభుత్వం
మోదీ ప్రభుత్వం (PM Modi Govt) దేశాభివృద్ధితో పాటు దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు సమానంగా కృషి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే..
- ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువైన అవినీతిపై కేంద్ర ప్రభుత్వం రాజీలేని పోరును కొనసాగిస్తోంది.
- 2047 నాటికి దేశంలో పేదరికం ఉండకూడదని, మధ్యతరగతి వర్గం కూడా ప్రగతిపథంలో సాగాలని ఆకాంక్షించారు.
- సర్జికల్ స్ట్రైక్స్ నుంచి ఉగ్రవాదంపై ఉక్కుపాదం వరకు; సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (LAC), నియంత్రణ రేఖల (LOC) వద్ద పొరుగుదేశాల దుస్సాహసాలకు సరైన సమాధానం ఇవ్వడం నుంచి ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాఖ్ ల రద్దు వరకు నా ప్రభుత్వం అత్యంత నిర్ణయాత్మకంగా వ్యవహరించింది.
- నిజాయతిపరులను గౌరవించే ప్రభుత్వం ఇది.
- విధాన పరమైన చచ్చుబాటు నుంచి భారత్ (India) బయటకు వచ్చింది. ఇప్పుడు భారతదేశాన్ని అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రపంచమంతా పరిగణిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా భారత్ ఇప్పుడు ప్రపంచంలో ఐదో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా (5th largest economy) ఎదిగింది.
- మహిళాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నాం. వారి అభివృద్ధిని అడ్డుకునే అన్ని ఆటంకాలను ఈ ప్రభుత్వం తొలగిస్తోంది. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఉండేలా చూస్తోంది.
- భారతీయుల ఆత్మ విశ్వాసం ఇప్పుడు అత్యున్నత స్థితికి చేరింది. గత 9 ఏళ్ల పాలనలో ఈ ప్రభుత్వం ఎన్నో సానుకూల మార్పులను తీసుకురాగలిగింది. భారత్ పట్ల ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కోణం కూడా మారింది.
- స్వాతంత్య్రం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి పూర్తిస్థాయిలో స్వయం సమృద్ధంగా మారుతుందని విశ్వసిస్తున్నా.
- మన దేశ సమస్యలను ఇతరులు వచ్చి పరిష్కరించే రోజుల నుంచి, మనమే అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రోజుల్లోకి వచ్చాం.