Manipur Violence: “నా రాష్ట్రం.. మణిపూర్ తగలబడిపోతోంది.. సాయం చేయండి”: ప్రధానికి మేరీకోమ్ వినతి: ఆర్మీ మోహరింపు
Manipur Violence: తీవ్ర ఘర్షణలు జరిగిన మణిపూర్‌లో ఆర్మీ మోహరించింది. అల్లర్లు జరిగిన ప్రాంతంలో సైనికులు ఫ్లాగ్‍మార్చ్ నిర్వహించారు.
Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోంది. గిరిజన వర్గాల నిరసనతో బుధవారం ఆ రాష్ట్రంలో తీవ్ర ఘర్షణలు జరిగాయి. చురాచాంద్‍పూర్, ఇంపాల్, కంగ్‍పోక్పీ జిల్లాలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీంతో 8 జిల్లాల్లో మణిపూర్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. గురువారం రోజున ఆర్మీ కూడా మణిపూర్‌లో మోహరించింది. సమస్యాత్మక జిల్లాల్లో ఆర్మీ ఫ్లాగ్‍మార్చ్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు విన్నపం చేశారు. సాయం చేయాలంటూ ట్వీట్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
Manipur Violence:“నా రాష్ట్రం మణిపూర్ తగలబడిపోతోంది. దయచేసి సాయం చేయండి” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‍నాథ్ సింగ్‍కు ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు లెజెండరీ బాక్సర్ మేరీకోమ్.
Manipur Violence: గిరిజనేతర మైటీలను (Meities) ఎస్టీ కమ్యూనిటీలో చేర్చవద్దంటూ ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) ఆధ్వరంలో చురాచాంద్‍పూర్ జిల్లాల్లో బుధవారం నిర్వహించిన గిరిజన సంఘీభావ ర్యాలీలో ఘర్షణలు మొదలయ్యాయి. వేలాది మంది ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లు పక్క జిల్లాలకు కూడా పాకాయి. వేరే ప్రాంతాల్లోనూ అల్లర్లు జరిగాయి.
ఇంపాల్ వెస్ట్, చురచాంద్‍పూర్, కంగ్‍పోక్పీ, కక్చింగ్, తౌంబల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిలాల్లో ఘర్షణలు జరిగాయి. గిరిజనేతర ప్రాబల్యమున్న ప్రాంతాల్లోనూ ఆందోళన జరిగాయి.
Manipur Violence: మైటీ కమ్యూనిటీని ఎస్‍టీల్లో చేర్చే ప్రతిపాదనను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మణిపూర్ హైకోర్టు ఇటీవల ఆదేశించడం పట్ల గిరిజన వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఐదు రోజులు ఇంటర్నెట్ బంద్
Manipur Violence: ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రం ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు మణిపూర్ ప్రభుత్వం తెలిపింది. అయితే, బ్రాడ్‍బ్యాండ్ సేవలు అందుబాటులో ఉంటాయి.
టాపిక్