Tripura CM Manik Saha: రెండో సారీ ‘మానిక్ సర్కార్’-manik saha takes oath as tripura cm for second consecutive time ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tripura Cm Manik Saha: రెండో సారీ ‘మానిక్ సర్కార్’

Tripura CM Manik Saha: రెండో సారీ ‘మానిక్ సర్కార్’

HT Telugu Desk HT Telugu
Mar 08, 2023 01:08 PM IST

Tripura CM Manik Saha:త్రిపుర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మానిక్ సాహ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఈశాన్య రాష్ట్ర సీఎంగా మానిక్ సాహ బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా రెండో సారి.

త్రిపుర సీఎంగా ప్రమాణం చేస్తున్న బీజేపీ నేత మానిక్ సాహ
త్రిపుర సీఎంగా ప్రమాణం చేస్తున్న బీజేపీ నేత మానిక్ సాహ (PTI)

Tripura CM Manik Saha: త్రిపుర సీఎంగా బీజేపీ నేత మానిక్ సాహ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. త్రిపుర (Tripura) సీఎంగా మానిక్ సాహ బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా రెండో సారి.

Tripura CM swearing in ceremony: మోదీ, షా హాజరు..

త్రిపుర ముఖ్యమంత్రిగా మానిక్ సాహ (Manik Saha) బుధవారం ప్రమాణం చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అగర్తల లోని వివేకానంద మైదాన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నేతలైన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర హో మంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ చీఫ్ జేపీ నడ్డా (JP Nadda) హాజరయ్యారు. అలాగే, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, మణిపూర్ ముఖ్యమంత్రి బిరెన్ సింగ్, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

Tripura CM Manik Saha: డెంటల్ సర్జన్..

మానిక్ సాహ (Manik Saha) దంత వైద్యుడు. 2016లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. 2020లో ఆయనను త్రిపుర (Tripura) బీజేపీ చీఫ్ గా నియమించారు. 2022 మార్చిలో రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. కానీ, ఆ తరువాత అనూహ్యంగా, అప్పటివరకు సీఎం గా విప్లవ్ కుమార్ దేవ్ స్థానంలో మానిక్ సాహా (Manik Saha) కు సీఎంగా అవకాశం కల్పించారు. సీఎం బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించడంతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయ తీరాలకు చేర్చారు. దాంతో, మరోసారి ఆయననే రాష్ట్ర సీఎంగా అధిష్టానం ఎంపిక చేసింది.

Tripura assembly elections results: 32 సీట్లు..

ఇటీవల త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. త్రిపురలోని మొత్తం 60 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు గెలుచుకుని అధికార పీఠం చేజిక్కించుకుంది. స్థానిక గిరిజనుల మద్దతున్నత్రిపా మోథా 13 సీట్లను, సీపీఎం 11 సీట్లను, కాంగ్రెస్ 3 సీట్లను గెల్చుకున్నాయి.

IPL_Entry_Point