Kia soul accident : ఇలాంటి కార్​ యాక్సిడెంట్​ మీరు ఎప్పుడు చూసుండరు!-kia soul launches into air after being hit by a truck wheel video goes viral ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Kia Soul Launches Into Air After Being Hit By A Truck Wheel Video Goes Viral

Kia soul accident : ఇలాంటి కార్​ యాక్సిడెంట్​ మీరు ఎప్పుడు చూసుండరు!

Sharath Chitturi HT Telugu
Mar 28, 2023 01:29 PM IST

Kia soul accident viral video : అమెరికాలో కియా సోల్​ కారుకు జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఒళ్లుగగుర్పొడిచే ఈ వీడియోలో.. ట్రక్​ టైర్​ తగిలి.. కియా సోల్​ కారు గాల్లోకి ఎగిరి పల్టీ కొట్టింది!

ఇలాంటి కార్​ యాక్సిడెంట్​ మీరు ఎప్పుడు చూసుండరు!
ఇలాంటి కార్​ యాక్సిడెంట్​ మీరు ఎప్పుడు చూసుండరు! (HT AUTO)

Kia Soul viral video US : రోడ్డు ప్రమాదాలు సాధారణమైన విషయంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జురుగుతుంటాయి. కారు వెళ్లి లారీని ఢీకొట్టిందనో, బైక్​ వెళ్లి కారును ఢీకొట్టిందనో.. నిత్యం వార్తల్లో వింటూనే ఉంటాము. అయితే.. అమెరికా కాలిఫోర్నియాలో ఇటీవలే జరిగిన ఓ కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఇలాంటి కార్​ యాక్సిడెంట్​ను మీరు ఎప్పుడు చూసి ఉండరు! చూసిన వారందరు షాక్​కు గురవుతున్నారు.

అసలేం జరిగింది..

Kia Soul accident : కాలిఫోర్నియా లాస్​ ఏంజెల్స్​కు సమీపంలో జరిగింది ఈ ఘటన. సంబంధిత వీడియోను ఓ వ్యక్తి తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేశాడు. వీడియోలో ఓ హైవే కనిపిస్తోంది. ముందు ఓ ట్రక్​ వెళుతోంది. ఇంతలో వెనుక నుంచి ఓ 'కియా సోల్​' కారు దూసుకెళ్లింది. ట్రక్​- కియా సోల్​ పక్కపక్కకు వచ్చాయి. ఇక్కడి వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ క్షణంలో పరిస్థితి తలకిందులైపోయింది!

కియా సోల్​ కారు క్రాస్​ చేస్తున్న సమయంలోనే ట్రక్​ ఎడమ టైర్​ ఊడిపోయింది! అది సరిగ్గా వెళ్లి.. కియా సోల్​ ముందు భాగాన్ని ఢీకొట్టింది. ఆ వెంటనే.. కియా సోల్​ కారు గాల్లోకి ఎగిరి.. అనేకమార్లు పల్టీ కొట్టింది. కింద పడిన వెంటనే కూడా అనేకమార్లు పల్టీకొట్టంది.

Kia Soul accident viral video : మరోవైపు ఎడమ టైర్ ఊడిపోవడంతో ఆ ట్రక్​ బ్యాలెన్స్​ కోల్పోయింది. కుడివైపునుకు వెళ్లిపోయి.. చివరికి ఆగిపోయింది. 

ఈ ఘటనలో కియా సోల్​ ఔటర్​ పార్ట్​ ధ్వంసమైంది. కానీ క్యాబిన్​ మాత్రం అలాగే ఉంది! ఫలితంగా.. కియా సోల్​లోని డ్రైవర్​కు ఎలాంటి గాయాలవ్వలేదు. కొద్దిసేపటి తర్వాత.. అతను కారులో నుంచి లేచి వెళ్లిపోయాడు! ఈ ఒళ్లుగగుర్పొడిచే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలవ్వలేదు.

Kia Soul viral video : కియా సోల్​ యాక్సిడెంట్​కు సంబంధించిన వీడియోను చూసిన వారందరు షాక్​కు గురవుతున్నారు. ‘ఇంతసేపు ఇదొక సినిమా సీన్​ అనుకున్నా.. ఇది నిజంగానే జరిగిందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. “ఇంత జరిగినా ఎవరికి ఏం అవ్వకపోవడం సంతోషకరం,” అని మరో యూజర్​ రాసుకొచ్చాడు. ‘ఇలాంటి ప్రమాదాన్ని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు,’ అని మరో వ్యక్తి కామెంట్​ చేశాడు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి :

IPL_Entry_Point

సంబంధిత కథనం