Bribe: రూ.40లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు: ఇంట్లో రూ.6కోట్ల నగదు-karnataka bjp mla virupakshappa son prashant madal caught taking bribe 6 crore rupees found at his home ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Karnataka Bjp Mla Virupakshappa Son Prashant Madal Caught Taking Bribe 6 Crore Rupees Found At His Home

Bribe: రూ.40లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు: ఇంట్లో రూ.6కోట్ల నగదు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 03, 2023 11:22 AM IST

Karnataka BJP MLA Son Caught taking Bribe: కర్ణాటకలో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆ తర్వాత ఆయన ఇంట్లో చేసిన సోదాల్లో ఏకంగా రూ.6కోట్ల నగదు బయటపడింది.

Bribe: రూ.40లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు: ఇంట్లో రూ.6కోట్ల నగదు
Bribe: రూ.40లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు: ఇంట్లో రూ.6కోట్ల నగదు (ANI Photo)

Karnataka BJP MLA Son Caught taking Bribe: రూ.40లక్షల లంచం తీసుకుంటూ కర్ణాటకలో ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి పట్టుబడ్డారు. ఆయన బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప (Madal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ మదల్ (Prashanth Madal). కర్ణాటకకు చెందిన అవినీతి నిరోధక విభాగం ‘లోకాయుక్త’ (Lokayukta).. ప్రశాంత్‍ను అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆయన ఇంట్లో సోదాలు చేసింది. దీంతో ప్రశాంత్ ఇంట్లో ఏకంగా రూ.6కోట్ల నగదు దొరికింది. ఇంకా సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

రూ.40లక్షలు తీసుకుంటూ..

Karnataka BJP MLA Son Caught taking Bribe: బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్.. బెంగళూరు వాటర్ సప్లయ్, సీవేజ్ బోర్డు (BWSSB)లో చీఫ్ అకౌంటెంట్‍‍గా విధులు నిర్వరిస్తున్నారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.40లక్షల లంచం తీసుకుంటూ ఆఫీస్‍లో గురువారం పట్టుబడ్డారు ప్రశాంత్. లోకాయుక్త అధికారులు ప్రశాంత్‍ను పట్టుకొని, ఆఫీస్‍లోనూ సోదాలు జరిపారు. ఆఫీస్‍లో మూడు బ్యాగ్‍లను స్వాధీనం చేసుకున్నారు. “బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్‍ను రూ.40లక్షల లంచం తీసుకుంటుండగా.. లోకాయుక్త అవినీతి నిరోధక విభాగం నిన్న పట్టుకుంది. ఆయన ఆఫీస్ నుంచి రూ.1.75కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది” అని కర్ణాటక లోకాయుక్త వెల్లడించింది.

ప్రశాంత్‍ను అరెస్టు చేసిన అనంతరం ఆయన ఇంట్లో లోకాయుక్త అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో ఏకంగా రూ.6కోట్ల విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇంకా సోదాలు జరుగుతున్నాయి.

ప్రశాంత్ మదల్.. 2008 కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్‍. బీడబ్ల్యూఎస్ఎస్‍బీలో పని చేస్తున్న ఆయన లంచం తీసుకుంటున్నారని తమకు సమాచారం రావటంతో పట్టుకున్నామని లోకాయుక్త చెప్పింది. సబ్బులు, ఇతర డిటర్జెంట్స్ తయారు చేసేందుకు అవసరమైన మెటీరియల్ కాంట్రాక్టును అప్పగించేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ప్రశాంత్ మదల్ పట్టుబడ్డారు.

విరూపాక్షప్ప ప్రస్తుతం దేవనగెరె జిల్లాలోని చన్నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ప్రభుత్వ పరిధిలోని కర్ణాటక సోప్స్, డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) చైర్మన్‍గా ఉన్నారు. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికార బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అవినీతి కేసులో ఇరుక్కోవడం ఆ పార్టీకి కాస్త ఇబ్బంది కలిగించే విషయం కావొచ్చు.

IPL_Entry_Point