JEE Mains 2023: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పై కీలక అప్ డేట్-jee mains 2023 session 2 application window reopens on jeemainntanicin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Jee Mains 2023 Session 2 Application Window Reopens On Jeemain.nta.nic.in

JEE Mains 2023: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పై కీలక అప్ డేట్

HT Telugu Desk HT Telugu
Mar 15, 2023 02:06 PM IST

JEE Mains 2023: జేఈఈ మెయిన్ 2023 (JEE Mains 2023) సెషన్ 2 (session 2) పై కీలక అప్ డేట్ వెలువడింది. ఇంతకు ముందు అప్లికేషన్ ను సబ్మిట్ చేయడం కుదరని వారికి ఇప్పుడు తమ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మరో రెండు రోజుల అవకాశం లభించింది. JEE Mains 2023 session 2 application window reopens on jeemain.nta.nic.in

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (PTI / Representative image)

JEE Mains 2023: జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 (JEE Mains 2023 session 2) అప్లికేషన్ విండోను ఎన్టీఏ (National Testing Agency NTA) మరోసారి ఓపెన్ చేసింది. గతంలో అప్లై చేయడానికి వీలుకాని విద్యార్థులు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఈ అవకాశం మార్చి 15, మార్చి 15 తేదీల్లో మాత్రమే ఉంటుంది. అందుకోసం విద్యార్థులు jeemain.nta.nic.in. వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.

JEE Mains 2023: విద్యార్థుల అభ్యర్థన మేరకు..

ఇంతకుముందు జేఈఈ మెయిన్ సెషన్ 2 (JEE Mains 2023 session 2) అప్లికేషన్ విండో (application window) మార్చి 12 వరకు అందుబాటులో ఉంది. ఆ తరువాత పొరపాట్లను సవరించుకోవడానికి కరెక్షన్ విండో (correction window) మార్చి 14 రాత్రి 9 గంటల వరకు అవకాశం లభించింది. అయితే, సెషన్ 2 దరఖాస్తుల సబ్మిషన్ కు మరో అవకాశం ఇవ్వాలని విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు రావడంతో జేఈఈ మెయిన్ సెషన్ 2 దరఖాస్తు గడవును మరో రెండు రోజులు పొడగించినట్లు ఎన్టీఏ (NTA) వెల్లడించింది. ఈ అవకాశం (application window) మార్చి 16 వరకు ఉంటుందని స్పష్టం చేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు విద్యార్థులు తమ అప్లికేషన్స్ ను సబ్మిట్ చేయలేకపోయిన విషయాన్ని ఎన్టీఏ (NTA) గుర్తించిందని తెలిపింది. సెషన్ 1లో అప్లై చేయని విద్యార్థులు, అలాగే, సెషన్ 1 లో అప్లై చేసిన విద్యార్థులు ఈ మార్చి 15, మార్చి 16 తేదీల్లో తమ దరఖాస్తులను సబ్మిట్ చేయవచ్చని వివరించింది.

JEE Mains 2023: అడ్మిట్ కార్డ్స్..

జేఈఈ మెయిన్ 2023కి సంబంధించి ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ (Intimation of Examination City), అడ్మిట్ కార్డ్స్ (Admit Cards) డౌన్ లోడ్, ఫలితాల వెల్లడి.. మొదలైన విషయాలను సమయానుకూలంగా జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తామని ఎన్టీఏ తెలిపింది. దరఖాస్తుల సబ్మిషన్ కు ఇది చివరి అవకాశమన్న విషయాన్ని, మరో అవకాశం ఇవ్వడం కుదరదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని ఎన్టీఏ స్పష్టం చేసింది.

IPL_Entry_Point