I-T raids | కారవాన్, ప్రింట్ తదితర మీడియాలకు ఫండింగ్ చేసే సంస్థల్లో ఐటీ సోదాలు-it dept conducts survey on cpr oxfam in fcra case probe
Telugu News  /  National International  /  I-t Dept Conducts Survey On Cpr, Oxfam In Fcra Case Probe
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

I-T raids | కారవాన్, ప్రింట్ తదితర మీడియాలకు ఫండింగ్ చేసే సంస్థల్లో ఐటీ సోదాలు

07 September 2022, 22:35 ISTHT Telugu Desk
07 September 2022, 22:35 IST

I-T raids | కేంద్ర ప్రభుత్వ చర్యలను, బీజేపీని నిశితంగా విమర్శించే కొన్ని మీడియా సంస్థలకు నిధులను అందజేసే ట్రస్ట్ లపై ఆదాయ పన్ను శాఖ బుధవారం దాడులు చేసింది.

I-T raids | ప్రభుత్వ విధానాలపై మేథో మథనం జరిపే సంస్థగా పేరున్న సీపీఆర్(Centre for Policy Research - CPR), డిజిటల్ మీడియా సంస్థలకు నిధులను సమకూర్చే Independent and Public-Spirited Media Foundation (IPSMF), చారిటీ సంస్థ Oxfam India ల కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు చేసి, సోదాలు నిర్వహించింది.

I-T raids | అక్రమ కార్యకలాపాలపై...

ఆయా సంస్థలు నిర్వహించిన అక్రమ ఆర్థిక కార్యకలాపాలపై రుజువులతో కూడిన సమాచారం అందిన తరువాతే ఈ సోదాలు నిర్వహించినట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. CPR ఢిల్లీ ఆఫీస్ లో, IPSMF బెంగళూరు కార్యాలయంలో ఈ సోదాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను సునిశితంగా విమర్శించే కారవాన్, ద ప్రింట్, స్వరాజ్య వంటి డిజిటల్ మీడియా సంస్థలకు IPSMF ట్రస్ట్ నిధులను అందజేస్తుంటుంది. అయితే, ఈ దాడులపై ఆయా సంస్థలు ఇంతవరకు స్పందించలేదు. హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో నిర్వహించిన దాడుల్లో లభించిన సమాచారం పేరకు ఈ దాడులు జరిపినట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా, ఆయా సంస్థలకు లభించిన విదేశీ డొనేషన్ల వివరాల్లో అవకతవకలు ఉన్నాయని తమకు సమాచారం ఉందని వెల్లడించాయి. దాదాపు 20 రిజిస్టరైన, గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు అందజేసిన నిధుల విషయాన్ని కూడా ఐటీ శాఖ పరిశీలిస్తోందని సమాచారం.

I-T raids | ప్రభుత్వ వ్యతిరేకతే కారణమా?

ఆదాయ పన్ను దాడులకు ఆయా డిజిటల్ మీడియా పోర్టల్స్ ప్రచురించి ప్రభుత్వ వ్యతిరేక కథనాలే కారణమన్న వాదన వినిపిస్తోంది. 2002 గుజరాత్ అల్లర్లలో నేటి ప్రధాని, నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ కి క్లీన్ చిట్ ఇచ్చిన దర్యాప్తు సంస్థ నివేదికను ఇటీవల కారవాన్` పత్రిక తూర్పారపట్టింది. ఆ నివేదిక ఆధారంగానే ఇటీవల సుప్రీంకోర్టు నాటి అల్లర్లలో మోదీ పాత్ర పై ఇకపై ఎలాంటి విచారణ అవసరం లేదని తీర్పునిచ్చింది. IPSMF కు చైర్ పర్సన్ గా టీ ఎస్ నినన్, ట్రస్టీల్లో నటుడు అమోల్ పాలేకర్, డోనర్లలో అజిమ్ ప్రేమ్ జీ, గోద్రేజ్, నిలేకని కుటుంబాలు ఉన్నాయి. అలాగే, CPR ను దేశ మేథావుల్లో ఒకరైన ప్రతాప్ భాను మెహతా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన నిశితంగా విమర్శిస్తుంటారు. అలాగే, సంస్థ గవర్నింగ్ బోర్డ్ చైర్ పర్సన్ గా జేఎన్ యూ ప్రొఫెసర్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ప్రిన్సిపల్ మీనాక్షి గోపీనాథ్ ఉన్నారు.

I-T raids | ఆక్స్ ఫామ్ ఇండియా

అలాగే, అంతర్జాతీయ ఎన్జీవోల కన్సార్షియం ఆక్స్ ఫామ్ కు భారతీయ విభాగంగా ఉన్న ఆక్స్ ఫామ్ ఇండియా కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. భారతీయ రాజ్యంగంలో పేర్కొన్న విధంగా, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వ విధానాల రూపకల్పన కోసం పని చేస్తుందని ఈ సంస్థ వెబ్ సైట్ లో పేర్కొన్నారు.