India earthquake risk : ఇండియాకు ‘భూకంపం’ ముప్పు.. టర్కీ కన్నా ఎక్కువ తీవ్రత!-is india at risk of massive earthquake iit professor expressed concerns ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Earthquake Risk : ఇండియాకు ‘భూకంపం’ ముప్పు.. టర్కీ కన్నా ఎక్కువ తీవ్రత!

India earthquake risk : ఇండియాకు ‘భూకంపం’ ముప్పు.. టర్కీ కన్నా ఎక్కువ తీవ్రత!

Sharath Chitturi HT Telugu
Feb 11, 2023 11:55 AM IST

Earthquakes in India : ఇండియాలో టర్కీ స్థాయి భూకంపం వచ్చే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్​కు చెందిన ఓ ప్రొఫెసర్​ పేర్కొన్నారు. దేశంలో గత కొన్నేళ్లుగా వస్తున్న భూప్రకంపనలపై ఆయన రీసెర్చ్​ చేస్తున్నారు.

ఇండియాకు ‘భూకంపం’ ముప్పు.. టర్కీ కన్నా ఎక్కువ తీవ్రత!
ఇండియాకు ‘భూకంపం’ ముప్పు.. టర్కీ కన్నా ఎక్కువ తీవ్రత!

India earthquake warning : భూకంపం అనంతర టర్కీ నుంచి వెలుగులోకి వస్తున్న దృశ్యాలు, కన్నీటి కథలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. టర్కీ ప్రజల కోసం ప్రపంచ దేశాలు ప్రార్థనలు చేస్తున్నాయి. అయితే.. ఇండియాలోనూ తరచూ భూకంప ఘటనలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఈ తరహా ఘటనలు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. ఇప్పుడు టర్కీ పరిస్థితులను చూసి భారతీయులు సైతం భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఐటీ కాన్పూర్​కు చెందిన ఓ ప్రొఫెసర్​ వ్యాఖ్యలు మరింత ఆందోళనకు గురిచేసే విధంగా ఉన్నాయి. ఇండియాకు భూకంపాల తీవ్రత చాలా ఎక్కువగా ఉందన్నారు.

'జాగ్రత్తగా ఉండాల్సిందే..!'

దేశంలో భూకంపాల కారణాలు, వాతావరణ మార్పులపై గత కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు ప్రొఫెసర్​ జావెద్​ మాలిక్​. ఇండియాలోని కొన్ని భాగాల్లో.. 7.5 తీవ్రతతో భూ ప్రకంపనలు వెలుగుచూసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Earthquake risk in India : ఒకటి, రెండు దశాబ్దాల్లో లేదా ఒకటి, రెండేళ్లల్లోనే టర్కీ తరహా తీవ్రతతో భూకంపం సంభవించవచ్చని జావెద్​ మాలిక్​ పేర్కొన్నారు.

"భూకంపం కేంద్రబిందువు హిమాలయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అండమాన్​ నికోబార్​ దీవుల్లోనూ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ తరహా భూకంపాలు వస్తాయని అంచనా వేస్తున్నప్పుడు.. అదే తరహాలో సిద్ధంగా ఉండాలి. నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి," అని ఐఐటీ కాన్పూర్​ ప్రొఫెసర్​ జావెద్​ మాలిక్​ తెలిపారు. కచ్​, అండమాన్​, ఉత్తరాఖండ్​ ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు.

India earthquake news : భూకంపాల అంశంలో దేశాన్ని 5 జోన్​లుగా విడదీశారు. జోన్​-5 అనేది అత్యంత తీవ్రమైనది. కచ్​, అండమాన్​ నికోబార్​, హిమాలయ ప్రాంతాలు ఇందులో ఉంటాయి. జోన్​-4లో బెహ్రిచ్​, లఖింపూర్​, పిలిభిట్​, ఘజియాబాద్​, రూర్కీ, నైనిటల్​లు ఉన్నాయి. కాన్పూర్​, లక్నో, ప్రయాగ్​రాజ్​, వారణాసి, సోన్​భాద్రలు జోన్​-3లో ఉన్నాయి.

భూమి కింద ఉన్న టెక్టోనిక్​ ప్లేట్​లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో వెలువడే ఎనర్జీ వల్ల భూకంపం సంభవిస్తుందని ప్రొఫెసర్​ జావెద్​ మాలిక్​ తెలిపారు. ఆ ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటే, భూ ప్రకంపనల తీవ్రత అంత ఎక్కువగా ఉండొచ్చని వివరించారు.

24వేలు దాటిన మృతుల సంఖ్య..

Turkey earthquake death toll : కొన్ని రోజుల క్రితం టర్కీ, సిరియాలో 7.8 తీవ్రతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 24వేలు దాటింది. 80వేలకుపైగా మంది ప్రజలు గాయపడ్డారు. అనేక మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point