Indigo flight emergency landing: సౌదీ అరేబియాలోని జెడ్డా (jeddah) నుంచి ఢిల్లీ (Delhi) వస్తున్న ఇండిగో (indigo flight) విమానాన్ని మంగళవారం ఉదయం జోధ్ పూర్ విమానాశ్రయంలో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని ఒక మహిళ కు గుండెపోటు రావడంతో అత్యవసరంగా జోధ్ పూర్ (jodhpur) లో ల్యాండింగ్ చేసి, ఆ మహిళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.,Indigo flight emergency landing: మహిళ మృతిఅయితే, ఆసుపత్రికి వెళ్లేటప్పటికే దురదృష్టవశాత్తూ 60 ఏళ్ల ఆ మహిళ మరణించింది. జెడ్డా నుంచి వస్తున్నామని, ఢిల్లీ వెళ్లిన తరువాత కనెక్టింగ్ ఫ్లైట్ లో కశ్మీర్ వెళ్లాల్సి ఉందని ఆ మహిళ కుమారుడు మీర్ ముజఫర్ తెలిపారు. ‘గుండెల్లో నొప్పిగా ఉందని అమ్మ చెప్పగానే నేను విమాన సిబ్బందికి చెప్పాను. పరిస్థితి సిరియస్ నెస్ అర్థం చేసుకున్న సిబ్బంది వెంటనే జోధ్ పూర్ లో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ కు నిర్ణయం తీసుకున్నారు’ అని వివరించాడు. తీవ్రమైన గుండెపోటు (cardiac arrest) రావడంతో , ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే ఆ మహిళ మరణించిందని జోధ్ పూర్ లోని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. లీగల్ ఫార్మలిటీస్ పూర్తి చేసి, మృతదేహాన్ని ఆమె కుమారుడికి అప్పగించామన్నారు. మృతదేహాన్ని రోడ్డు మార్గంలో తమ స్వస్థలానికి తీసుకువెళ్లడానికి వాహనం కూడా ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు, చెన్నై లో అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా మంగళవారం ఉదయం చెన్నైలో ల్యాండ్ కావాల్సిన పలు విమానాలను బెంగళూరుకు డైవర్ట్ చేసినట్లు, మరికొన్ని ఆలస్యంగా బయల్దేరినట్లు ఇండిగో (indigo airlines) తెలిపింది.