IBPS RRB Notification 2023: 8,000కుపైగా బ్యాంకు ఉద్యోగాలు.. నేడే దరఖాస్తులు ప్రారంభం
IBPS RRB Notification 2023: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ 2023 నోటిఫికేషన్ వెల్లడైంది. వివిధ బ్యాంకుల్లో 8,000కు పైగా పోస్టులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది.
IBPS RRB Notification 2023: దేశవ్యాప్తంగా వివిధ రీజనల్, రూరల్ బ్యాంకుల్లో (RRB) కర్క్‌లు, ప్రొహిబిషనరీ ఆఫీసర్ల(పీవో)ల పోస్టుల భర్తీకి ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) నోటిఫికేేషన్ జారీ చేసింది. సుమారు 8,000కు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ఐబీపీఎస్ ఆఫీసర్స్ (స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3), ఆఫీస్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్‍ను తీసుకొచ్చింది. ఈ పోస్టులకు దరఖాస్తులు నేడు (జూన్ 1) మొదలయ్యాయి. జూన్ 21వ తేదీ దరఖాస్తులకు ఆఖరు గడువుగా ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు ibps.in వెబ్‍సైట్‍లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ వివరాలు ఇవే.
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్స్, ఆఫీస్ అసిస్టెంట్స్ ప్రిలిమినరీ పరీక్ష ఈ ఏడాది ఆగస్టులో జరగనుంది. మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్‌లో ఉండే అవకాశం ఉంది. జూలై 17 నుంచి 22 వరకు ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్‍ను ఐబీపీఎస్ నిర్వహించనుంది.
ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ కింద మొత్తంగా సుమారు 8,611 పోస్టులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. ఇందులో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు (క్లర్స్) 5,538, ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులు 2,485 (పీవో), ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులు 1,515, ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులు 73 ఉన్నాయి.
వయో పరిమితి వివరాలు
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు
ఆఫీసర్ స్కేల్ 1 (అసిస్టెంట్ మేనేజర్): 18 నుంచి 30 సంవత్సరాలు
ఆఫీసర్ స్కేల్ 2 (మేనేజర్): 21 నుంచి 32 సంవత్సరాలు
ఆఫీసర్ స్కేల్ 3 (సీనియర్ మేనేజర్): 21 నుంచి 40 సంవత్సరాలు
ఎస్‍సీ, ఎస్‍టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. మరిన్ని కొన్ని కేటగిరీలకు మినహాయింపు ఉంది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు తప్పనిసరిగా నోటిఫికేషన్ పరిశీలించాలి. Ibps.in వెబ్‍సైట్‍లో నోటిఫికేషన్ ఉంది.
విద్యార్హత
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు (గ్రూడ్యుయేట్లు) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కేల్-2, స్కేల్-1 పోస్టులకు డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. విద్యార్హత, వయోపరిమితి, రిజర్వేషన్‍తో పాటు మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్‍ను పరిశీలించాలి. దరఖాస్తు చేసే ముందు తప్పకుండా నోటిఫికేషన్‍ను క్షుణ్ణంగా చూడాలి.
అప్లికేషన్ ఫీజు
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ పోస్టులకు ఆన్‍లైన్ అప్లికేషన్ ఫీజు రూ.850గా ఉంది. ఎస్‍సీ, ఎస్‍టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు రూ.175గా ఉంది.
ఐబీపీఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిలా..
- ముందుగా ఐబీపీఎస్ అధికారిక వెబ్‍సైట్ ibps.in లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో Apply online for CRP RRBs-XII అనే లింక్‍పై క్లిక్ చేయాలి.
- అనంతరం దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్టు లింక్‍పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత అప్లికేషన్‍లో వివరాలు ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత ఫీజు చెల్లించాలి, సబ్మిట్ బటన్‍పై క్లిక్ చేయాలి.
- అనంతరం అప్లికేషన్‍ను ప్రింటౌట్ తీసుకోవాలి.
ఈ నోటిఫికేషన్‍లోని పోస్టులకు దరఖాస్తు చేసేందుకు జూన్ 21వ తేదీ తుది గడువుగా ఉంది.