Minister Sandeep Singh Resigns: హర్యానా మంత్రిపై లైంగిక వేధింపుల కేసు.. రాజీనామా.. గతంలో భారత హాకీ కెప్టెన్-haryana minister sandeep singh resigns after sexual harassment case denise charge ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Minister Sandeep Singh Resigns: హర్యానా మంత్రిపై లైంగిక వేధింపుల కేసు.. రాజీనామా.. గతంలో భారత హాకీ కెప్టెన్

Minister Sandeep Singh Resigns: హర్యానా మంత్రిపై లైంగిక వేధింపుల కేసు.. రాజీనామా.. గతంలో భారత హాకీ కెప్టెన్

Haryana Minister Sandeep Singh resigns: లైంగిక వేధింపుల కేసు నమోదవటంతో హర్యానా క్రీడాశాఖ మంత్రి సందీప్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గతంలో ఆయన భారత హాకీ జట్టుకు కెప్టెన్‍గానూ వ్యవహరించారు.

సందీప్ సింగ్ (ANI)

Haryana Sports Minister Sandeep Singh resigns: హర్యానా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్‍పై లైంగిక వేధింపుల ఆరోపణపలు సంచలనంగా మారాయి. ఆయనపై చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళా జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఫిర్యాదు మేరకు సందీప్ సింగ్‍పై లైంగిక వేధింపులు, నేరపూరితమైన బెదిరింపు కేసు రిజిస్టర్ చేశారు. దీంతో తన పదవికి రాజీనామా చేశారు సందీప్ సింగ్. తన వాదన వినిపించారు. వివరాలివే..

నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకే..

తనపై వచ్చిన లైగింక వేధింపుల ఆరోపణలను మంత్రి సందీప్ సింగ్ తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్టను తెబ్బ తీసేందుకు ఇలా చేస్తున్నారంటూ ఆరోపించారు. “నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకు చేస్తున్న ప్రయత్నమే ఇది. నాపై వచ్చిన ఈ అబద్ధపు ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ ఉంటుందని ఆశిస్తున్నా. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయటికి వచ్చే వరకు క్రీడా శాఖలో నా బాధ్యతలను ముఖ్యమంత్రికి అప్పగిస్తున్నా” అని సందీప్ సింగ్ అన్నారు. తన పదవికి రాజీనామా చేశారు.

ఇవీ ఆరోపణలు

హర్యానాలోని ప్రతిపక్ష ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ జూనియర్ కోచ్ మాట్లాడారు. తనపై మంత్రి సందీప్ సింగ్ లైగింక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. సోషల్ మీడియాలో తనకు సందీప్ తరచూ మెసేజ్‍లు చేసేవారని చెప్పారు. అభ్యంతరకర రీతిలో తనను ముట్టుకున్నారని, బెదిరింపులతో కూడిన మెసేజ్‍లు పంపేవారని జూనియర్ అథ్లెటిక్స్ కోచ్‍గా ఉన్న ఆమె ఆరోపించారు. ఈ వేధింపులు తాళలేక తాను సోషల్ మీడియాను వాడడం మానేశానని చెప్పారు. తొలుత సందీప్ సింగ్ తనను జిమ్‍లో చూశారని, ఆ తర్వాత ఇన్‍స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయ్యారని ఆమె తెలిపారు. నేషనల్ గేమ్స్ సర్టిఫికేట్‍కు సంబంధించి మాట్లాడాలని, తనను కలవాలని అడిగారని చెప్పారు.

కాగా, వెంటనే సందీప్ కుమార్ సింగ్‍ను మంత్రి పదవి నుంచి తీసేయాలని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఐఎన్ఎల్‍డీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సీనియల్ నేత భూపేందర్ సింగ్ కూడా ఈ వివాదంపై స్పందించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కురుక్షేత్ర జిల్లాలోని పెహోవా నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సందీప్ సింగ్. గతంలో భారత హాకీ జట్టు కెప్టెన్‍గానూ వ్యవహరించారు. సందీప్ సింగ్ జీవితం ఆధారంగా 2018లో సూర్మ (Soorma) అనే బయోపిక్ కూడా విడుదలైంది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.