Ukraine Russia Crisis | యుద్ధ ప్రకటనతో పెరిగిన బంగారం ధర
Ukraine Russia Crisis | ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య ప్రకటించడంతో బంగారం ధర పెరుగుతోంది. బంగారం ధర 13 నెలల గరిష్టానికి చేరింది. ఉక్రెయిన్‌లో సైనిక కార్యకలాపాలకు పుతిన్ అనుమతి ఇవ్వడంతో బంగారం ధర పెరుగుతూ పోతోంది. మరోవైపు బ్రెంట్ ధరలు 2014 తర్వాత మొదటిసారిగా బ్యారెల్‌కు వంద డాలర్ల ధర దాటింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై గురువారం తెల్లవారుజామున దాడి ప్రకటన చేశారు. రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన స్వర్గధామానికి తరలివెళ్లడంతో గురువారం బంగారం ధరలు 2% పైగా పెరిగాయి. ఫిబ్రవరిలో ఇప్పటివరకు 8 శాతం పెరిగింది.
ట్రెండింగ్ వార్తలు
బంగారం 1.6% పెరిగి ఔన్సుకు $1,937.82 వద్దకు చేరింది. అమెరికాలో గోల్డ్ ఫ్యూచర్స్ 2% పెరిగి $1,937.10కి చేరుకుంది.
రష్యా దళాలు పలు ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులను ప్రయోగించాయి. దాని దక్షిణ తీరంలో దళాలను మోహరించాయి. రష్యా ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్ర ప్రారంభించిందని, ఆయుధ దాడులతో నగరాలను లక్ష్యంగా చేసుకుంటోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఒక ట్వీట్‌లో తెలిపారు.
ఈ విలువైన లోహం విలువలో జూలై 2020 నుంచి క్రమమైన పెరుగుదల కనిపించింది. ‘అమెరికా డాలర్‌తో పాటుగా బంగారం ఒక స్వర్గధామ ఆస్తి. అనివార్యంగా బంగారంలో కొత్త ఆల్ టైమ్ గరిష్టాలను చూడొచ్చు..’ అని సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు జెఫ్రీ హాలీ అన్నారు.
ధరలు ఔన్స్‌కి $1,960 వరకు ర్యాలీని కొనసాగించవచ్చని, తదుపరి కొన్ని సెషన్‌లలో $ 2,000ని తాకవచ్చని హాలీ అన్నారు.
రష్యా ప్రపంచంలో మూడో అతిపెద్ద బంగారం ఉత్పత్తిదారుగా ఉంది. దేశంలోని నార్నికెల్ కూడా పల్లాడియం, ప్లాటినం లోహాల ప్రధాన ఉత్పత్తిదారు.
ఇక వెండి ఔన్స్‌కు 1.6% పెరిగి $ 24.91కి, ప్లాటినం 0.9% పెరిగి $1,101.56కి, పల్లాడియం 1.4% పెరిగి $2,516.39 వద్దకు చేరుకుంది.
డాలర్, చమురు ధరలు కూడా పెరిగాయి. అయితే గ్లోబల్ స్టాక్‌లు, యుఎస్ బాండ్ ఈల్డ్‌లు తగ్గాయి.
‘పశ్చిమ దేశాలు విధించే ఏవైనా ఆంక్షలు నిజంగా రష్యాను ఆశించిన విధంగా ప్రభావితం చేయవు. బంగారం పెరగడానికి ఇది మరొక కారణం..’ అని సిటీ ఇండెక్స్‌లో సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు మాట్ సింప్సన్ అన్నారు.
సంబంధిత కథనం