Telugu News  /  National International  /  Girl Allegedly Raped, Strangulated In Up's Mainpuri, Investigation Underway
బాలికపై అత్యాచారం..! ఆపై గొంతు నులిమి హత్య!
బాలికపై అత్యాచారం..! ఆపై గొంతు నులిమి హత్య!

బాలికపై అత్యాచారం..! ఆపై గొంతు నులిమి హత్య!

06 October 2022, 12:03 ISTSharath Chitturi
06 October 2022, 12:03 IST

UP girl strangled to death : ఓ బాలిక మృతదేహం అనుమానాస్పద రీతిలో కనిపించిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మైన్​పూరిలో కలకలం సృష్టించింది. ఆమెపై అత్యాచారం జరిగినట్టు, నిందితుడు ఆమె గొంతు నులిమి, ఫ్యాన్​కు వేలాడదీసి చంపినట్టు తెలుస్తోంది.

UP girl strangled to death : ఉత్తర్​ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద రీతిలో ఓ బాలిక మృతదేహం, ఆమె గదిలో వేలాడుతూ కనిపిచింది. ఆమెపై అత్యాచారం చేసి, నిందితుడు చంపేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఏం జరిగింది..?

మైన్​పూరిలోని భోగౌన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో బుధవారం జరిగింది ఈ ఘటన. బాధితురాలి కుటుంబం నగ్ల శీశమ్​ గ్రామంలో నివాసముంటోంది. బాధితురాలి తండ్రి.. పని మీద వేరే ప్రాంతానికి వెళ్లాడు. తల్లి ఆగ్రాకు వెళ్లింది. సోదరి.. కోచింగ్​కు వెళ్లింది.

కాగా కోచింగ్​ నుంచి తిరిగొచ్చిన సోదరికి ఫ్యాన్​కు వేలాడుతూ బాధితురాలి మృతదేహం కనిపించింది. కొన్ని నిమిషాల్లోనే స్థానికులు ఇంటి చుట్టూ చేరారు. పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. తనకు పుష్పేంద్ర అనే వ్యక్తిపై అనుమానం ఉన్నట్టు బాలిక సోదరి పోలీసులకు వివరించింది. అతనే తన సోదరిని గొంతు నులిమి చంపేశాడని ఆరోపించింది. ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేసుకున్నారు.

ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేపట్టి, నిందితుడిని శిక్షిస్తామని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎవరిని పోలీసులు అరెస్ట్​ చేయలేదని తెలుస్తోంది.

ఉత్తర్​ప్రదేశ్​లో..

UP crime news : యూపీలో గత నెల 15న.. లఖింపూర్​ ఖేరీ ప్రాంతంలో ఇద్దరు దళిత అక్కచెల్లిళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఈ ఘటన సంచలనం సృష్టించింది. వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు.. చివరికి చంపేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

ఇలాంటి ఘటనలు ఉత్తర్​ప్రదేశ్​లో ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళలు, బాలికలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.