Stampede in Tamil Nadu: తొక్కిసలాటలో నలుగురు మహిళల దుర్మరణం-four women killed after stampede in tamil nadu cm announces relief ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Four Women Killed After Stampede In Tamil Nadu, Cm Announces Relief

Stampede in Tamil Nadu: తొక్కిసలాటలో నలుగురు మహిళల దుర్మరణం

HT Telugu Desk HT Telugu
Feb 04, 2023 10:13 PM IST

Stampede in Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మరణించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

Stampede in Tamil Nadu: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. ఉచితంగా ధోవతులు, చీరలు పంపిణీ చేయడానికి టోకెన్లు జారీ చేస్తుండగా, అక్కడికి భారీగా జనం చేరుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

Stampede in Tamil Nadu: నలుగురు మృతి

తొక్కిసలాట జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టిన వ్యక్తి అధికారుల నుంచి కానీ, పోలీసుల నుంచి కానీ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. తిరుప్పత్తూరు జిల్లాలోని వేణియంబడి వద్ద జరిగే తాయిపూసం ఉత్సవం సందర్భంగా ఉచితంగా చీరలు, ధోవతులు పంపిణీ చేయడానకిి టోకెన్లు జారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ సంఖ్యలో ప్రజలు చేరుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో నలుగురు మహిళలు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Stampede in Tamil Nadu: ముఖ్యమంత్రి సంతాపం

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత చికిత్స అందించాలని ఆదేశించారు. తాయిపూసం అనేది తమిళ నెల తాయిలో పౌర్ణమి రోజు తమిళులు జురుపుకునే ఉత్సవం.

IPL_Entry_Point