Cyrus Mistry : టాటా సన్స్​ మాజీ ఛైర్మన్​ సైరస్​ మిస్త్రీ దుర్మరణం-former tata sons head cyrus mistry killed in car crash near mumbai ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Former Tata Sons Head Cyrus Mistry Killed In Car Crash Near Mumbai

Cyrus Mistry : టాటా సన్స్​ మాజీ ఛైర్మన్​ సైరస్​ మిస్త్రీ దుర్మరణం

Sharath Chitturi HT Telugu
Sep 04, 2022 05:02 PM IST

Cyrus Mistry dies in road accident : టాటా సన్స్​ మాజీ ఛైర్మన్​ సైరస్​ మిస్త్రీ మరణించారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

సైరస్​ మిస్త్రీ
సైరస్​ మిస్త్రీ

Cyrus Mistry dies in road accident : మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్​ మాజీ ఛైర్మన్​ సైరస్ ​మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న కారు పాల్గఢ్​ జిల్లాలో.. ఆదివారం మధ్యాహ్నం 3:15 గంటలకు ఓ డివైడర్​ను ఢీకొట్టింది.

అహ్మదాబాద్​ నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న సమయంలో సైరస్​ మిస్త్రీకి చెందిన మెర్సిడీస్​ కారు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.

"మధ్యాహ్నం 3:15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సుర్య నది బ్రిడ్జ్​ మీద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇది యాక్సిడెంట్​గా భావిస్తున్నాము," అని పాల్గఢ్​ జిల్లా ఎస్​పీ బాలాసాహెబ్​ పటేల్​.. మీడియాకు వెళ్లడించారు.

<p>ప్రమాదానికి గురైన సైరస్​ మిస్త్రీ వాహనం</p>
ప్రమాదానికి గురైన సైరస్​ మిస్త్రీ వాహనం (ANI)

రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో సైరస్​ మిస్త్రీ వాహనంలో మరో ముగ్గురు ఉన్నారు. సైరస్​ మిస్త్రీతో పాటు మరొకరు మరణించారు. మిగిలిన ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.

సైరస్​ మిస్త్రీ మృతదేహాన్ని.. పోస్టుమార్టం కోసం కాసా రూరల్​ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు స్పష్టం చేశారు.

"సైరస్​ మిస్త్రీ అకాల మరణ వార్త విని బాధ కలిగింది. జీవితంలో ఏదైన సాధించాలని ఆయనకు ఉండేది. ఇంత చిన్న వయస్సులో ఆయన మరణించడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. సైరస్​ మిస్త్రీ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి," అని.. టాటా సన్స్​ ఛైర్మన్​ ఎన్​ చంద్రశేఖర్​ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

టాటా గ్రూప్​లో సైరస్​ మిస్త్రీ ప్రస్తానం..

Cyrus Mistry Tata Sons : దిగ్గజ వ్యాపార వేత్త రతన్​ టాటా రిటైర్మంట్​ తర్వాత.. 2012లో టాటా సన్స్​ ఛైర్మన్​ బాధ్యతలను చేపట్టారు సైరస్​ మిస్త్రీ. కాగా.. 2016లో ఆ బాధ్యతల నుంచి సైరస్​ మిస్త్రీని తప్పిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై కొన్నేళ్ల పాటు సుప్రీంకోర్టులో విచారణ నడిచింది.

సైరస్​ మిస్త్రీ తర్వాత.. టాటా గ్రూప్​ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​గా ఎన్​. చంద్రశేఖరన్​ బాధ్యతలు స్వీకరించారు.

<p>ప్రమాదానికి గురైన సైరస్​ మిస్త్రీ వాహనం</p>
ప్రమాదానికి గురైన సైరస్​ మిస్త్రీ వాహనం (ANI)

మరోవైపు సైరస్​ మిస్త్రీ మరణంపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"నా సోదరుడు సైరస్​ మిస్త్రీ మరణ వార్తను నేను నమ్మలేకపోతున్నాను. రెస్ట్​ ఈన్​ పీస్​ సైరస్​," అని ఎన్​సీపీ నేత సుప్రియా సూలే ట్విట్టర్​లో ట్వీట్​ చేశారు.

"రోడ్డు ప్రమాదంలో సైరస్​ మిస్త్రీ మరణించారన్న వార్త బాధాకరం. ఆయన నాకు మంచి మిత్రుడు, జెంటిల్​మాన్​. షాపూర్​ పలోంజీ వ్యాపారాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. టాటా గ్రూప్​ను నడిపించారు," అని ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్​పీజీ ఎంటర్​ప్రైజెస్​ ఛైర్మన్​ హర్ష్​ గొయెంకా ట్వీట్​ చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం