World Happiness Report 2023: ‘హ్యాపీనెస్‍’లో మెరుగైన ఇండియా.. కానీ నేపాల్, పాక్ కంటే వెనుకే! టాప్-10 దేశాలు ఇవే-finland tops world happiness report sixth time in row india rank below nepal pakistan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Finland Tops World Happiness Report Sixth Time In Row India Rank Below Nepal Pakistan

World Happiness Report 2023: ‘హ్యాపీనెస్‍’లో మెరుగైన ఇండియా.. కానీ నేపాల్, పాక్ కంటే వెనుకే! టాప్-10 దేశాలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 21, 2023 06:09 AM IST

World Happiness Report 2023: వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు వెల్లడైంది. ఫిన్లాండ్ మరోసారి ప్రపంచంలోనే సంతోషకర దేశంగా టాప్ ర్యాంకులో నిలిచింది.

World Happiness Report 2023: ‘హ్యాపీనెస్‍’లో మెరుగైన ఇండియా
World Happiness Report 2023: ‘హ్యాపీనెస్‍’లో మెరుగైన ఇండియా (MINT)

World Happiness Report 2023: యాన్యువల్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు వచ్చేసింది. మార్చి 20న ప్రపంచ హ్యాపీనెస్ డే సందర్భంగా యూఎన్ సస్టైనబులిటీ డెవలప్‍మెంట్ సెల్యూషన్స్ నెట్‍వర్క్ ఈ రిపోర్టును వెల్లడిస్తుంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ర్యాంకింగ్‍లను ప్రకటించింది. తలసరి ఆదాయం, సోషియల్ సపోర్ట్, ఆరోగ్యకర జీవనం, స్వేచ్ఛ, అత్వల్ప అవినీతి, దాతృత్వం సహా వివిధ జాతీయ, అంతర్జాతీయ అంశాలను కొలమానాలుగా చేసుకొని ఈ ర్యాంకులను ఈ సంస్థ నిర్ణయిస్తుంది. కాగా, 2023కు గాను ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్ మరోసారి నిలిచింది. వరుసగా ఆరోసారి ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు, గతేడాదితో పోలిస్తే ఈ హ్యాపీనెస్ సూచీలో ఇండియా ర్యాంకు మెరుగుపడినా.. 125వ ప్లేస్‍లో ఉంది.

World’s Happiest Countries 2023: టాప్-10 దేశాలు ఇవే

  • ఫిన్లాండ్
  • డెన్మార్క్
  • ఐల్యాండ్
  • ఇజ్రాయెల్
  • నెదర్లాండ్స్
  • స్వీడెన్
  • నార్వే
  • స్విట్జర్లాండ్
  • లక్సెమ్‍బర్గ్
  • న్యూజిల్యాండ్

ఎప్పటిలాగే ఈ హ్యాపీనెస్ జాబితాలో నార్డిక్ దేశాలే టాప్‍లో నిలిచాయి.

ఇండియా ఎక్కడ?

World’s Happiest Countries 2023: వరల్డ్ హ్యాపీయెస్ట్ దేశాల విషయంలో గతేడాదితో పోలిస్తే భారత్ స్థానం మెరుగుపడింది. గతేడాది 136వ స్థానంలో ఉండగా.. ఈ సంవత్సరం 125 స్థానానికి భారత్ చేరింది. అయినా కూడా పొరుగు దేశాలైన నేపాల్ (78), పాకిస్థాన్ (108), బంగ్లాదేశ్ (118), చైనా (64) కంటే ఇంకా భారత్‍ ఈ విషయంలో వెనుకబడే ఉంది. అయితే, సంక్షోభం ఉన్న దేశాల కంటే ఇండియాలో సంతోషం తక్కువగా ఉందా? అంటూ ఈ రిపోర్టుపై ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ నివేదిక తీరుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అత్యంత ‘బాధాకర’ దేశాలు

World’s Happiest Countries 2023: 137 దేశాలకు హ్యాపీనెస్ సూచీలో ర్యాంకులు వెలువడగా.. తాలిబాన్ పాలనలో ఉన్న అఫ్గానిస్థాన్ చివరి స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యంత అన్‍హ్యాపీ దేశంగా అఫ్గాన్‍ను ఈ రిపోర్ట్ పేర్కొంది. ఇక లెబనాన్, జింబాబ్వే, డెమక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కూడా జాబితాలో చివరి స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాల్లో అవినీతి అధికంగా ఉండడంతో పాటు జీవన ప్రమాణాలు దయనీయంగా ఉన్నాయని పేర్కొంది.

రష్యా, ఉక్రెయిన్ ఇలా..

World’s Happiest Countries 2023: గతేడాది ఫిబ్రవరి నుంచి యుద్ధం చేసుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ కూడా ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టులో భారత్‍ కంటే మెరుగైన స్థానాల్లోనే ఉన్నాయి. రష్యా 70వ ప్లేస్‍లో ఉండగా.. ఉక్రెయిన్ 92 స్థానంలో నిలిచింది. రష్యాలో దయాగుణం బాగా పడిపోయిందని ఈ నివేదిక పేర్కొంది.

IPL_Entry_Point