Drone shot down near Pakistan border: భారత్ లోకి లైన్ కడుతున్న పాక్ డ్రోన్లు-drone shot down near pakistan border in punjab s tarn taran 7th incident in a week ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Drone Shot Down Near Pakistan Border In Punjab's Tarn Taran, 7th Incident In A Week

Drone shot down near Pakistan border: భారత్ లోకి లైన్ కడుతున్న పాక్ డ్రోన్లు

HT Telugu Desk HT Telugu
Dec 06, 2022 05:14 PM IST

Drone shot down near Pakistan border: భారత్ పై జరుపుతున్న పరోక్ష యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ డ్రోన్లను పెద్ద ఎత్తున వినియోగిస్తోంది.డ్రోన్ల ద్వారా ఆయుధాలను, డ్రగ్స్ ను, మందుగుండు సామగ్రిని భారత్ లోకి పంపిస్తోంది.

బీఎస్ఎఫ్ జవాన్లు నేలకూల్చిన పాక్ డ్రోన్
బీఎస్ఎఫ్ జవాన్లు నేలకూల్చిన పాక్ డ్రోన్

Drone shot down near Pakistan border: సరిహద్దుల్లో కాపలా విధుల్లో ఉన్న భారతీయ సైనికులకు కొత్త విధి ప్రారంభమైంది. సరిహద్దుల రక్షణ, చొరబాటుదార్ల ప్రయత్నాలను అడ్డుకోవడం మొదలైన విధులతో పాటు పాక్ నుంచి వస్తున్న డ్రోన్ల(Drones)ను గుర్తించి, వాటిని నేలకూల్చడమనే కొత్త డ్యూటీ ప్రారంభమైంది.

Seven Drones in a week: వారంలో ఏడు..

పంజాబ్ లోని టార్న్ టరన్ జిల్లాలో సోమవారం రాత్రి సరిహద్దు భద్రత దళం(Border Security Force - BSF) జవాన్లు పాక్ నుంచి వచ్చిన మరో డ్రోన్ ను నేల కూల్చారు. టార్న్ టరన్ జిల్లాలో పాక్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న కాలియా గ్రామంలో నేల కూల్చిన ఈ డ్రోన్(Drone) నుంచి 2.5 కిలోల మాదక ద్రవ్యం హెరాయిన్(Heroin) ను స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజుల్లో పాక్ నుంచి వచ్చిన ఏడో డ్రోన్ ఇది. సోమవారం కూడా అమృతసర్ జిల్లాలోని పాక్ సరిహద్దు ప్రాంతంలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు అడ్డుకున్నారు. పాక్ నుంచి వచ్చిన ఒక డ్రోన్ ను, దాదాపు 3 కేజీల హెరాయిన్(Heroin) ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఆదివారం రోజు కూడా 3 కేజీ ల హెరాయిన్ తో పాక్ నుంచి వచ్చిన డ్రోన్ ను టార్న్ టారన్ జిల్లాలో కూల్చివేశారు. డిసెంబర్ 3న పాక్ సరిహద్దులోని ఫజిల్కా జిల్లాలో తేదీన పాక్ నుంచి వచ్చిన ఒక డ్రోన్ జారవిడిచిన 25 కేజీల హెరాయిన్(Heroin) ను బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

IPL_Entry_Point

టాపిక్