Pak Drone: డ్రోన్ ద్వారా జార విడిచిన ఆయుధాలు స్వాధీనం-arms and ammunition dropped by pakistani drone recovered in jammu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pak Drone: డ్రోన్ ద్వారా జార విడిచిన ఆయుధాలు స్వాధీనం

Pak Drone: డ్రోన్ ద్వారా జార విడిచిన ఆయుధాలు స్వాధీనం

Mahendra Maheshwaram HT Telugu
Aug 18, 2022 08:19 AM IST

arms dropped by pakistani drone: జమ్ము కశ్మీర్ సరిహద్దులోని ఓ ప్రాంతంలో ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

పోలీసు స్వాధీనం చేసుకున్న డ్రోన్
పోలీసు స్వాధీనం చేసుకున్న డ్రోన్ (ANI)

Arms and ammunition dropped by pakistani drone: జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ కు చెందిన డ్రోన్లు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు పట్టుబడగా… ఓ కేసులో కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. అంతర్జాతీయ సరిహద్దు ఉన్న తోఫ్ గ్రామ సరిహద్దుల్లో ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం... పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ ను జారవిడిచిన విషయంలో ఫిబ్రవరి 24వ తేదీన అర్నియా పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో జమ్ము కశ్మీర్ కు చెందిన ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన వెనక పాకిస్థాన్ కు చెందిన ఓ ఖైదీతో పాటు లష్కరే తోయిబా పాత్ర ఉందని విచారణలో వెల్లడించాడు.

నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన.. జైలుకు తరలించారు. తర్వాత జరిపిన విచారణలో డ్రోన్ ద్వారా ఆయుధాల సరఫరాకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించాడు. మందుగుండు సామాగ్రిని దాచి పెట్టిన రెండు ప్రదేశాల వివరాలను నిందితుడు చెప్పాడు. ఆయుధాలను రికవరీ చేసుకునేందుకు ఆయా ప్రదేశాలకు సంబంధిత మెజిస్ట్రేట్ తో పాటు పోలీసులు బృందం వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

'మొదటి ప్రదేశంలో ఎలాంటి ఆయుధాలు దొరకలేదు. కానీ నిందితుడు చెప్పిన రెండో ప్రదేశమైన తోఫ్ గ్రామంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు దొరికాయి. ప్యాకెట్‌ను తెరిచే సమయంలో నిందితుడు.. ఒక పోలీసు అధికారిపై దాడి చేసి సర్వీస్ రైఫిల్ లాక్కున్నాడు. పోలీసు పార్టీపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.' అని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేశ్ సింగ్ చెప్పారు.

పోలీసులు ప్రతిదాడులు చేయటంతో నిందితుడు గాయపడ్డాడు. జమ్ములోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్