CSIR recruitment : సీఎస్​ఐఆర్​లో సైంటిస్ట్​ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి-csircentral road research institute apply for 11 scientist gr iv posts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Csir-central Road Research Institute: Apply For 11 Scientist Gr.iv Posts

CSIR recruitment : సీఎస్​ఐఆర్​లో సైంటిస్ట్​ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

Sharath Chitturi HT Telugu
Mar 06, 2023 08:09 AM IST

CSIR recruitment : సీఎస్​ఐఆర్​లో కొన్ని సైంటిస్ట్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ పడింది. ఆ వివరాలు..

సీఎస్​ఐఆర్​
సీఎస్​ఐఆర్​

CSIR recruitment 2023 : సీఎస్ఐఆర్​ (సెంట్రల్​ రోడ్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​)లో 11 సైంటిస్ట్​ జీఆర్​.4 పోస్టులకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఇప్పటికే మొదలైన అప్లికేషన్​ ప్రక్రియ.. ఈ నెల 29తో ముగియనుంది. సీఎస్​ఐఆర్​ అధికారిక వెబ్​సైట్​ crridom.gov.in లో అప్లికేషన్​లను దాఖలు చేయవచ్చు.

వేకెన్సీ వివరాలు..

11 సైంటిస్ట్​ జీఆర్​.4 (2) పోస్టులకు ప్రస్తుతం రిక్రూట్​మెంట్​ డ్రైవ్​ జరుగుతోంది. అప్లికేషన్​ దాఖలు చేస్తున్న అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 32 మించి ఉండకూడదు.

సీఎస్​ఐఆర్​లో ఉద్యోగాలు- ఇలా అప్లై చేసుకోండి..

CSIR scientist jobs : స్టెప్​ 1:- సీఎస్​ఐఆర్​ అధికారిక వెబ్​సైట్​ crridom.gov.in లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- హోం పేజ్​లో రిక్రూట్​మెంట్​ ట్యాబ్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- 'క్లిక్​ హియర్​ టు అప్లై ఫర్​ పోస్ట్స్​ ఆఫ్​ సైంటిస్ట్స్​' అన్న లింక్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 4:- అప్లికేషన్​ ఫామ్​ను ఫిల్​ చేయండి.

స్టెప్​ 5:- సంబంధిత డాక్యుమెంట్​లను అప్లోడ్​ చేసి, అప్లికేషన్​ ఫామ్​ను సబ్మీట్​ చేయండి.

స్టెప్​ 6:- అప్లికేషన్​ను డౌన్​లౌడ్​ చేసుకుని ప్రింటౌట్​ తీసుకోండి.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​ను చూడాల్సి ఉంటుంది.

గెయిల్​లో ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టులు..

GAIL recruitment 2023 : ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుల అప్లికేషన్లకు ఆహ్వానించింది గెయిల్​ ఇండియా లిమిటెడ్​. అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టు అప్లికేషన్​కు తుది గడువు మార్చ్​ 15. అభ్యర్థులు గెయిల్​ అధికారిక వెబ్​సైట్​ అయిన gailonline.com లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎగ్జిక్యూటివ్​ ట్రైనీకి సంబంధించి 47 ఖాళీలకు ప్రస్తుతం రిక్రూట్​మెంట్​ జరుగుతోంది. వీటిల్లో 20 పోస్టులు.. ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (కెమికల్​), 11 పోస్టులు ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (సివిల్​), 8 పోస్టులు ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (గెయిల్​టెల్​ టీసీ/టీఎం), మరో 8 పోస్టులు ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (బీఐఎస్​)కు చెందినవి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

టాపిక్