UPSC Civils 2022 results: యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫలితాల వెల్లడి; తొలి నాలుగు ర్యాంకులు మహిళలకే..-civil services examination 2022 results declared by upsc ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Civils 2022 Results: యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫలితాల వెల్లడి; తొలి నాలుగు ర్యాంకులు మహిళలకే..

UPSC Civils 2022 results: యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫలితాల వెల్లడి; తొలి నాలుగు ర్యాంకులు మహిళలకే..

HT Telugu Desk HT Telugu
May 23, 2023 02:20 PM IST

UPSC Civils 2022 results: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2022 ఫైనల్ ఫలితాలు వెలువడ్డాయి. సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

UPSC Civils 2022 results: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2022 ఫైనల్ ఫలితాలు వెలువడ్డాయి. సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. తొలి నాలుగు ర్యాంకులు మహిళలే సాధించడం ఈ యూపీఎస్సీ సివిల్స్ 2022 ప్రత్యేకత. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.upsc.gov.in/ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.

UPSC Civils 2022 results: టాప్ 4 మహిళలే..

యూపీపఎస్సీ సివిల్స్ 2022 ఫలితాల్లో మహిళలు చరిత్ర సృష్టించారు. తొలి నాలుగు ర్యాంకులు మహిళలే సాధించడం ఈ యూపీపఎస్సీ సివిల్స్ 2022 ప్రత్యేకత. తొలి ర్యాంక్ ను ఇషిత కిషోర్ సాధించగా, రెండో ర్యాంక్ ను గరిమా లోహియా, మూడో ర్యాంక్ ను ఉమా హారతి, నాలుగో ర్యాంక్ ను స్మృతి మిశ్రా సాధించారు.

UPSC Civils 2022 results: మొత్తం 933 మందికి సెలెక్షన్

ఈ సివిల్స్ 2022 లో మొత్తం 933 మంది ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత పోస్ట్ లకు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ 933 మందిలో జనరల్ కేటగిరీలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 99 మంది, ఓబీసీ కేటగిరీలో 263 మంది, ఎస్సీ కేటగిరీలో 154, ఎస్టీ కేటగిరిలో 72 మంది ఎంపికయ్యారు. అలాగే, ఈ సవిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా 180 మందిని ఐఏఎస్ కు, 200 మందిని ఐపీఎస్ కు, 38 మందిని ఐఎఫ్ఎస్ కు, 473 మందిని గ్రూప్ ఏ కేంద్ర సర్వీసులకు, 131 మందిని గ్రూప్ బీ సర్వీసులకు ఎంపిక చేశారు. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.upsc.gov.in/ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.

IPL_Entry_Point