సరిహద్దులోకి దూసుకొచ్చిన చైనా 'రాకెట్​'.. భారత సైనిక శిబిరాలే టార్గెట్​!-china tests a rocket along lac that can hit critical indian army bases ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  సరిహద్దులోకి దూసుకొచ్చిన చైనా 'రాకెట్​'.. భారత సైనిక శిబిరాలే టార్గెట్​!

సరిహద్దులోకి దూసుకొచ్చిన చైనా 'రాకెట్​'.. భారత సైనిక శిబిరాలే టార్గెట్​!

Sharath Chitturi HT Telugu
Jul 22, 2022 06:56 AM IST

China LAC news : వాస్తవాధీన రేఖ వెంబడి రాకెట్​ను ప్రయోగించింది చైనా. భారత సైనిక శిబిరాలను ఢీకొట్టే రేంజ్​లో ఆ రాకెట్​ దూసుకెళ్లింది!

సరిహద్దులో చైనా రాకెట్​ ప్రయోగం.. భారత సైన్యం శిబిరమే లక్ష్యం?
సరిహద్దులో చైనా రాకెట్​ ప్రయోగం.. భారత సైన్యం శిబిరమే లక్ష్యం? (Mint)

China LAC news : చైనా మరోమారు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది! వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న భారత సరిహద్దు వద్ద రాకెట్​ పరీక్ష నిర్వహించింది!

అడ్వాన్స్​డ్​ మల్టిపుల్​ లాంచ్​ రాకెట్​ సిస్టమ్​(ఎంఎల్​ఆర్​ఎస్​)ను పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీగా పేరొందిన చైనా సైన్యం.. వాస్తవాధీన రేఖ వెంబడి ప్రయోగించింది. ఈ రాకెట్​.. భారత సైన్యం ఉన్న శిబిరాలని ఢీకొట్టేంత చేరువగా వచ్చినట్టు సమాచారం.

మీడియా కథనాల ప్రకారం.. చైనాలోని జిన్​జియాంగ్​ ప్రాంతంలో రాకెట్​ వ్యవస్థను చైనా ప్రయోగించి. ఆ రాకెట్​.. 5,300మీటర్ల ఎత్తులో ప్రయాణించింది. కాగా.. పీహెచ్​ఎల్​-16 ఎంఎల్​ఆర్​ఎస్​ వంటి అత్యాధునిక రాకెట్​ వ్యవస్థను భారత్​- చైనా సరిహద్దు వెంబడి మోహరించేందుకు డ్రాగన్​ ప్రణాళికలు రచిస్తోంది.

India China border : తాజా పరిణామాలతో ఇప్పటికే దారుణంగా ఉన్న భారత్​-చైనా సంబంధం మరింత బలహీన పడే అవకాశం లేకపోలేదు! రెండున్నరేళ్ల క్రితం.. వాస్తవాధీన రేఖ వెంబడి అలజడులు సృష్టించింది చైనా. ఫలితంగా ఇరు దేశాల సరిహద్దుల్లో ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎన్ని చర్చలు, ఎన్ని భేటీలు జరుపుతున్నా.. సమస్యలకు పరిష్కారాలు దొరకడంలేదు.

కాగా.. ఆదివారమే భారత్​-చైనా ఉన్నతాధికారుల మధ్య 16వ రౌండ్​ భేటీ జరిగింది. ఆ తర్వాత.. కొద్ది రోజులకే చైనా తన రాకెట్​ను ఎల్​ఏసీ వెంబడి ప్రయోగించడం గమనార్హం.

చైనా మాటలు, చేష్టలు వేరువేరుగా ఉంటున్నాయి. చర్చల్లో శాంతి జపం చేస్తూనే.. క్షేత్రస్థాయిలో మాత్రం ఉద్రిక్తతలు పెంచుతోంది చైనా. అత్యంత వివాదాస్పద పాంగ్యాంగ్​ సరస్సుకు సమీపంలో బుధవారమే చైనా సైనిక విన్యాసాలు నిర్వహించినట్టు వార్తలొచ్చాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్