1.19 మిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చిన బిన్​ లాడెన్​ కుటుంబం.. కానీ!-bin laden family donated 1m pounds to prince charles charity report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  1.19 మిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చిన బిన్​ లాడెన్​ కుటుంబం.. కానీ!

1.19 మిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చిన బిన్​ లాడెన్​ కుటుంబం.. కానీ!

Sharath Chitturi HT Telugu
Jul 31, 2022 07:37 PM IST

ఒసామా బిన్​ లాడెన్​ కుటుంబసభ్యులు.. ప్రిన్స్​ ఛార్లెస్​ ఛారిటీ ట్రస్ట్​కు 1.19 మిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చినట్టు ఓ నివేదిక పేర్కొంది. వివరాల్లోకి వెళితే..

1.19 మిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చిన బిన్​ లాడెన్​ కుటుంబం!
1.19 మిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చిన బిన్​ లాడెన్​ కుటుంబం! (REUTERS)

Osama bin laden family : ఒసామా బిన్​ లాడెన్​ కుటుంబసభ్యులు.. ప్రిన్స్​ ఛార్లెస్​ ఛారిటీ ట్రస్ట్​కు 1 మిలియన్​ పౌండ్లు(1.19మిలియన్​ డాలర్లు) విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని సండే టైమ్స్​ నివేదిక పేర్కొంది. బిన్​ లాడెన్​ సవతి తల్లి కుమారులు బకర్​ బిన్​ లాడెన్​- షఫీక్​ల విరాళాన్ని ప్రిన్స్​ ఛార్లెస్​ స్వీకరించినట్టు నివేదిక వెల్లడించింది.

9/11 దాడుల సూత్రధారి బిన్​ లాడెన్​ పేరు వింటే ప్రపంచం ఇప్పటికీ వణికిపోతుంది. అయితే.. ఆయన సోదరులకు ఉగ్రవాదంతో సంబంధం ఉన్నట్టు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కాగా.. వారు విరాళాలు ఇవ్వడం మంచి విషయమే అయినా.. తాజా నివేదికతో ప్రిన్స్​ ఛార్లెస్​ మరిన్ని చిక్కుల్లో పడ్డారు! ఆయనకు చెందిన ఛారిటీ సంస్థలు అక్రమ పనులు చేస్తున్నట్టు ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. ప్రిన్స్​ ఛార్లెస్​కు ప్రయోజనం కలిగే విధంగా కొన్ని ప్రాజెక్టులకు.. సౌదీ వ్యాపారవేత్త మహ్​ఫౌజ్​ మరై ముబారక్​.. ట్రస్ట్​ ద్వారా భారీ మొత్తంలో నగదు చెల్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. వాటిపై ఫిబ్రవరిలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక తాజా వ్యవహారంతో పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం లేకపోలేదు.

Prince Charles : అయితే.. ఈ విరాళం వ్యవహారం 2013లో జరిగినట్టు తెలుస్తోంది. 2013లో లండన్​లోని క్లియరెన్స్​ హౌజ్​లో బకర్​ను ప్రిన్స్​ ఛార్లెస్​ కలిశారు. అప్పుడే ఆ విరాళానికి సంబంధించి చర్చలు జరిగినట్టు నివేదిక వెల్లడించింది. బిన్​ లాడెన్​ మరణించి అప్పటికే రెండేళ్లు గడిచిపోయింది.

కాగా.. బిన్​ లాడెన్​ కుటుంబసభ్యుల నుంచి విరాళాలు స్వీకరించవద్దని చాలా మంది ప్రిన్స్​ ఛార్లెస్​కు చెప్పినట్టు నివేదిక పేర్కొంది.

ఈ నివేదిక బయటకొచ్చిన అనంతరం పీడబ్ల్యూసీఎఫ్​(ప్రిన్స్​ ఆఫ్​ వేల్స్​ ఛారిటెబుల్​ ఫండ్​) ఛైర్మన్​ సర్​ ఇయాన్​ చెషేర్​ ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నగదు లావాదేవీలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే విరాళం స్వీకరించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి సమాచారం సేకరించనట్టు వెల్లడించారు. ట్రస్టీలు అందరు కలిసి నిర్ణయించిన తర్వాతే విరాళానికి అంగీకరించినట్టు స్పష్టం చేశారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం

టాపిక్