Bengaluru woman gang-raped: కారులో యువతి గ్యాంగ్ రేప్; నిందితుల అరెస్ట్-bengaluru woman sitting in park dragged into car gang raped 4 arrested
Telugu News  /  National International  /  Bengaluru Woman Sitting In Park Dragged Into Car, Gang-raped; 4 Arrested
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Bengaluru woman gang-raped: కారులో యువతి గ్యాంగ్ రేప్; నిందితుల అరెస్ట్

31 March 2023, 15:43 ISTHT Telugu Desk
31 March 2023, 15:43 IST

Bengaluru woman gang-raped: బెంగళూరులో సంచలనం సృష్టించిన యువతి గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Bengaluru woman gang-raped: కర్నాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడితో కలిసి పార్క్ లో కూర్చున్న యువతిని నలుగురు యువకులు బలవంతంగా లాక్కెళ్లి, కార్లో తిప్పుతూ గ్యాంగ్ రేప్ (gang rape) చేశారు.

Bengaluru woman gang-raped in a car: స్నేహితుడిని బెదిరించి..

మార్చి 25 అర్ధరాత్రి దాటిన తరువాత ఈ gang rape ఘటన చోటు చేసుకుంది. మార్చి 25 రాత్రి సమయంలో బెంగళూరు (Bengaluru) లోని నేషనల్ గేమ్స్ విలేజ్ పార్క్ (National Games Village Park) లో ఆ యువతి తన స్నేహితుడితో కూర్చుని ఉంది. అక్కడికి నలుగురు యువకులు కారులో వచ్చారు. వారిలో ఒక యువకుడు ఈ యువతి, ఆమె స్నేహితుడి వద్దకు వచ్చి ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఎందుకు కూర్చున్నారంటూ బెదిరించాడు. ఆ యువతితో పాటు ఉన్న యువకుడిని తీవ్రంగా బెదిరించడంతో ఆ యువకుడు పారిపోయాడు. ఆ తరువాత, కార్లో ఉన్న మరో ముగ్గురు యువకులు కూడా వచ్చి, ఆ యువతిని బలవంతంగా లాక్కెళ్లి కార్లో తీసుకెళ్లి పోయారు. రాత్రంతా బెంగళూరు (Bengaluru) లోని దోములూరు, ఇందిరానగర్, అనేకల్, నైస్ రోడ్ తదితర ప్రాంతాల్లో కార్లో తిప్పుతూ ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి (gang rape) పాల్పడ్డారు.

4 accused arrested: పోలీసులకు ఫిర్యాదు

అనంతరం, ఈ విషయాన్ని పోలీసులకు కానీ, మరెవరికి కానీ చెప్తే చంపేస్తామని బెదిరించి, ఆ యువతిని ఆమె ఇంటి వద్ద వదిలేశారు. ఆ యువతి కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నలుగురు నిందితులు శ్రీధర్, సతీశ్, విజయ్, కిరణ్ లను అరెస్ట్ చేశారు. బెంగళూరు (Bengaluru) లో అస్సాంకు చెందిన 34 ఏళ్ల యువతిని ఆమె సోషల్ మీడియా ఫ్రెండ్ సందీప్ రేప్ చేశాడని పోలీసులు వెల్లడించారు. ఆ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.