Man kills daughter : 'తిండి పెట్టడానికి డబ్బులు లేవు.. అందుకే కూతురిని చంపేశా'
Bengaluru man kills daughter : ఆ వ్యక్తికి.. వ్యాపారంలో నష్టం వచ్చింది. 6నెలలుగా ఉద్యోగం కూడా లేదు. తిండి పెట్టడానికి డబ్బులు లేవనే కారణంతో.. రెండేళ్ల కూతురిని చంపేశాడు! ఈ ఘటన బెంగళూరులో కలకలం సృష్టించింది.
Bengaluru man kills daughter : బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి.. తన రెండేళ్ల కమార్తెను హత్య చేశాడు. తిండి పెట్టడానికి డబ్బులు లేని కారణంతోనే ఈ పని చేసినట్టు పోలీసులకు చెప్పాడు.
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
గుజరాత్‌కు చెందిన రాహుల్ పార్మర్ అనే వ్యక్తికి.. భవ్య అనే మహిళతో కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి రెండేళ్ల పాప ఉంది. కుటుంబం మొత్తం.. రెండేళ్ల క్రితం.. గుజరాత్ నుంచి వలస వచ్చి బెంగళూరులో స్థిరపడ్డారు.
కాగా.. గత ఆరు నెలలుగా పార్మర్‌కు ఉద్యోగం లేదు. అదే సమయంలో.. బిట్‌కాయిన్ వ్యాపారంలో భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. ఫలితంగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.
Man kills daughter : ఈ సమయంలోనే.. పార్మర్ ఇంట్లో బంగారం ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది అని తెలుసుకునేందుకు తరచు అక్కడికి వెళ్లేవాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసిపోయింది. సొంత ఇంట్లో.. బంగారం ఆభరణలు దొంగిలించిన పార్మర్.. కుటుంబసభ్యులకు తెలియకుండా వాటిని తాకట్టు పెట్టాడని పోలీసులకు అర్థమైంది. తప్పుడు కేసు చేసి సమయాన్ని వృథా చేశాడని తేల్చారు. ఈ విషయం పార్మర్‌కు తెలిసింది.
ఇది జరిగిన కొన్ని రోజులకు.. పార్మర్ భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన భర్త, రెండేళ్ల కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది.
Bengaluru crime news : గత శనివారం రాత్రి.. కెండట్టి గ్రామంలోని ఓ చెరువులో రెండళ్ల చిన్నారి మృతదేహం.. స్థానికులకు కనిపించింది. ఆ పక్కనే ఓ బ్లూ కలర్ కారు ఆగి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. కోలర్ పోలీస్ రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పార్మర్ను అరెస్ట్ చేశారు. తిండి పెట్టడానికి డబ్బులు లేకపోవడంతో సొంత బిడ్డను చంపుకున్నట్టు పార్మర్ తెలిపాడు.
"బిట్‌కాయిన్ వ్యాపారంలో చాలా డబ్బులు కోల్పోయాను. నా బిడ్డకు తిండి పెట్టడానికి కూడా డబ్బులు లేవు. అందుకే చంపేశాను," అని విచారణలో అంగీకరించాడు పార్మర్. కూతురిని చంపిన తర్వాత.. పార్మర్ సూసైడ్‌కు ప్రయత్నించినట్టు తెలుస్తోంది.
దర్యాప్తు అనంతరం పార్మర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ కేసు పెట్టిన విషయం పోలీసులకు తెలిసిపోయిందన్న భయంతో.. పార్మర్ ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సొంత కూతురిని చంపిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
సంబంధిత కథనం