Sabarimala pilgrims can carry coconuts in flights: అయ్యప్ప భక్తులకు శుభవార్త-bcas allows sabarimala pilgrims to carry coconuts in cabin baggage in flights ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bcas Allows Sabarimala Pilgrims To Carry Coconuts In Cabin Baggage In Flights

Sabarimala pilgrims can carry coconuts in flights: అయ్యప్ప భక్తులకు శుభవార్త

HT Telugu Desk HT Telugu
Nov 22, 2022 10:28 PM IST

Sabarimala pilgrims can carry coconuts in flights: అయ్యప్ప భక్తులకు శుభవార్త. వారు ఇకపై విమానాల్లో క్యాబిన్ బ్యాగేజ్ లో ఇరుముడిని తీసుకువెళ్లవచ్చు.

ఇరుముడితో అయ్యప్ప భక్తులు
ఇరుముడితో అయ్యప్ప భక్తులు

Sabarimala pilgrims can carry coconuts in flights: విమానాల్లో ఇరుముడికి అనుమతిస్తూ పౌర విమానయాన శాఖ భద్రత విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేరళలోని శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుంది.

Irumudi allowed in Cabin baggage: క్యాబిన్ బ్యాగేజీలో..

మండే ప్రమాదమున్న కారణంతో ఇరుముడిని విమానాల్లోని క్యాబిన్ బ్యాగేజీలో ఇన్నాళ్లు అనుమతించలేదు. ఇరుముడిలో నెయ్యితో నింపిన కొబ్బరి కాయ, ఇతర పూజద్రవ్యాలు ఉంటాయి. ఇరుముడిని భక్తులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శబరిమల వెళ్లేవరకు ఇరుముడితోనే ఉంటారు. విమానాల్లోని క్యాబిన్ బ్యాగేజీల్లో ఇరుముడిని అనుమతించకపోవడంతో ఇన్నాళ్లు భక్తులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా ఆ ఆంక్షలను సడలిస్తూ Bureau of Civil Aviation Security (BCAS) నిర్ణయం తీసుకుంది.

Irumudi allowed in Cabin baggage: కొద్ది రోజులు మాత్రమే..

ఈ అవకాశం ప్రస్తుత సీజన్ ముగిసేవరకు, అంటే 2023, జనవరి 20 వరకు మాత్రమే ఉంటుందని BCAS వెల్లడించింది. ఎక్స్ రే, ఈటీడీ(Explosive Trace Detector), ఫిజికల్ చెక్ తరువాత ఇరుముడిని క్యాబిన్ లగేజీలో విమానంలోకి తీసుకువెళ్లడానికి అనుమతిస్తారు అని BCAS వెల్లడించింది. ప్రతీ ఏటా లక్షల్లో అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకుంటారు. 41 రోజుల కఠిన మండల దీక్ష అనంతరం వేలాదిగా భక్తులు ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి వెళ్తారు. ఇరుముడితో వెళ్లినవారికి మాత్రమే అయ్యప్ప ముందున్న 18 పవిత్ర మెట్ల ద్వారా గర్భగుడిలోనికి వెళ్లే అవకాశం లభిస్తుంది. వార్షిక మండలం మకరవిలక్కు యాత్ర కొరకు నవంబర్ 16న అయ్యప్ప ఆలయాన్ని తెరిచారు.

IPL_Entry_Point

టాపిక్