BBC documentary: బీబీసీ డాక్యుమెంటరీపై కొనసాగుతున్న రగడ-bbc documentary du seeks police help screening planned at madras university ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bbc Documentary: Du Seeks Police Help; Screening Planned At Madras University

BBC documentary: బీబీసీ డాక్యుమెంటరీపై కొనసాగుతున్న రగడ

HT Telugu Desk HT Telugu
Jan 27, 2023 08:12 PM IST

BBC documentary: 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన రెండు పార్ట్ ల డాక్యుమెంటరీపై భారత్ లో రగడ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో వామపక్ష, ప్రగతిశీల విద్యార్థి సంఘాలు నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తూ రూపొందిన ఈ డాక్యుమెంటరీని క్యాంపస్ లలో ప్రదర్శిస్తున్నాయి.

ఢిల్లీ యూనివర్సిటీ
ఢిల్లీ యూనివర్సిటీ (HT file photo)

BBC documentary: గుజరాత్ లో 2002లో జరిగిన దారుణ మత కలహాల పై బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) రూపొందించిన డాక్యుమెంటరీ (BBC documentary) భారత్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ అల్లర్ల సమయంలో నేటి ప్రధాని, నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ పోషించిన పాత్రను విమర్శిస్తూ రూపొందిన ఆ డాక్యుమెంటరీ (BBC documentary) ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయకుండా ప్రభుత్వం నిషేధం విధించింది.

ట్రెండింగ్ వార్తలు

BBC documentary: వర్సిటీల్లో ప్రదర్శనలు

ఈ నేపథ్యంలో పలు యూనివర్సిటీల్లో ఈ డాక్యుమెంటరీ (BBC documentary) ని విద్యార్థులు బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీలోని జేఎన్ యూలో (JNU) రెండు రోజుల క్రితం ఈ డాక్యుమెంటరీ (BBC documentary) ని చూస్తున్న విద్యార్థులపై రాళ్ల దాడి జరిగింది. తాజాగా, ఈ వివాదం ఢిల్లీ వర్సిటీకి పాకింది. ఢిల్లీ యూనివర్సిటీ (University of Delhi DU)లోని నార్త్ క్యాంపస్ లో ఈ డాక్యుమెంటరీ (BBC documentary) ని ప్రదర్శించనున్నామని భీమ్ ఆర్మీ స్టుడెంట్ ఫెడరేషన్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం NSUI, వామపక్ష విద్యార్థి విభాగం SFI శుక్రవారం ప్రకటించాయి. అయితే, ఈ స్క్రీనింగ్ లను అడ్డుకుంటామని యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించింది. ప్రభుత్వం నిషేధించిన డాక్యుమెంటరీ (BBC documentary) ని యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రదర్శించడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.

BBC documentary: ప్రభుత్వం సీరియస్

ఈ డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వలసవాద మనస్తత్వంతో వాస్తవ విరుద్ధంగా, ప్రచార చిత్రంలా ఈ డాక్యుమెంటరీ (BBC documentary) ని తీశారని విమర్శించింది. ఈ డాక్యుమెంటరీని నిషేధిస్తున్నామని స్పష్టంచేసింది. ఈ డాక్యుమెంటరీ (BBC documentary) ని షేర్ చేయకూడదని అన్ని సామాజిక మాధ్యమాలను ఆదేశించింది. మరోవైపు మద్రాసు యూనివర్సిటీ (Madras University) లో, ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో, కోల్ కతాలోని జాధవ్ యూనివర్సిటీ (Jadavpur University) లో ఈ డాక్యుమెంటరీ (BBC documentary) ని విద్యార్థులు ప్రదర్శించారు.. చెన్నైలో తన స్మార్ట్ ఫోన్ లో ఈ డాక్యుమెంటరీని వీక్షిస్తున్న చెన్నై కార్పొరేషన్ కౌన్సిలర్ ప్రియదర్శిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.

BBC documentary: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఈ డాక్యుమెంటరీ (BBC documentary) ని విద్యార్థులు ప్రదర్శించారు. అదే సమయంలో, బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ABVP మరో వివాదాస్పద చిత్రం కశ్మర్ ఫైల్స్ (The Kashmir Files) ను ప్రదర్శించింది.

IPL_Entry_Point

టాపిక్