Are you 5g ready : 5జీ సేవల కోసం మీరు సిద్ధమేనా?-are you 5g ready in india check all details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Are You 5g Ready : 5జీ సేవల కోసం మీరు సిద్ధమేనా?

Are you 5g ready : 5జీ సేవల కోసం మీరు సిద్ధమేనా?

Sharath Chitturi HT Telugu
Sep 26, 2022 06:39 PM IST

Are you 5g ready : 5జీ సేవలు మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. మరి వాటి కోసం మీరు, మీ స్మార్ట్​ఫోన్​ సిద్ధమేనా?

5జీ సేవలకు మీరు, మీ స్మార్ట్​ఫోన్​ సిద్ధమేనా?
5జీ సేవలకు మీరు, మీ స్మార్ట్​ఫోన్​ సిద్ధమేనా? (MINT_PRINT)

5G service in India : అక్టోబర్​లో 5జీ సేవలకు అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా 5జీ టెక్నాలజీ దేశంలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అన్న ఆసక్తికి తెరపడనుంది. అయితే.. 5జీ టెక్నాలజీకి మీరు, మీ స్మార్ట్​ఫోన్​ సిద్ధమేనా?

జీవనశైలిని అప్​గ్రేడ్ చేసుకోవాలనే భావనను పక్కనపెడితే.. అసలు ఇంటర్నెట్ కనెక్షన్ నుంచి మీరు ఏం పొందాలనుకుంటున్నారు? అనే దానిపై.. మీకు 5జీ అవసరమా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం ఆధారపడి ఉంటుంది. వేగవంతమైన ఇంటర్నెట్ అనేది ఎలాంటి బఫరింగ్ లేకుండా హై-క్వాలిటీ వీడియోలను స్ట్రీమ్ చేస్తుంది. అతి తక్కువ లేటెన్సీతో హై - గ్రాఫిక్స్ గేమ్స్​ని ప్లే చేస్తుంది.

5G launch in India : హై డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, మొబైల్ గేమింగ్, వీడియో కాల్స్ వంటి సేవలకు అంతరాయం లేకుండా పొందేందుకు అవసరమైన బ్యాండ్ విడ్త్, లాటెన్సీని 5జీ అందిస్తుంది. భారత స్మార్ట్​ఫోన్ వినియోగదారులకు సంబంధించి ఒక కన్జ్యూమర్ సర్వే ప్రకారం.. వేగవంతమైన నెట్​వర్క్​తో తమ మొబైల్ సేవలు మెరుగుపడతాయని 42శాతం మంది భావిస్తున్నారు. మరింత విశ్వసనీయమైన కనెక్షన్, మెరుగైన్ ఇన్​డోర్ కనెక్షన్ ఉంటాయని భావిస్తున్న వారి శాతం కూడా ఎక్కువగానే ఉంది. భారత ఆపరేటర్లు.. వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్ సి-బ్యాండ్, సబ్-1జీహెచ్​జెడ్​లలో అధిక సామర్థ్యాన్ని, కవరేజీని అందించనుంది. టాప్ లైన్ స్పీడ్స్​పరంగా చెప్పాలంటే.. ప్రస్తుత 4జీ కంటే కూడా 5జీ వేగం 7 నుంచి 10 రెట్లు అధికంగా ఉండనుందని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం!

2016లో జియో మొదలైనప్పుడు అది మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు, మార్కెట్ వాటా పొందేందుకు తన నూతన 4జీ నెట్​వర్క్​పై సుమారుగా 6 నెలల పాటు వాయిస్, డేటాను ఉచితంగా అందించిన విషయం తెలిసిందే. దీంతో 4జీ మార్కెట్​లో జియో అత్యధిక మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది.

5జి సేవలను అందించే పోటీలో.. ముందు ఉండాలని భారతీయ ఆపరేటర్లు తహతహలాడుతున్న తరుణంలో ఆకర్షణీయ 5జీ అప్​గ్రేడ్ ఆఫర్లు మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా జియో 'ట్రూ 5జీ' సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇప్పటికే ప్రకటించారు.

మన ఫోన్ 5జీకి సిద్ధమేనా?

5G in India latest news : మీ ఫోన్ 5జీని సపోర్ట్ చేస్తుందా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకు సులభ మార్గం ఉంది. 2019లో దేశంలో మొదటి 5జీ ఫోన్ రావడాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. మీరు మీ ఫోన్ నెట్ వర్క్ సెట్టింగ్స్​ను లేదా మీ సిమ్ కార్డ్​కు సంబంధించి ప్రిఫర్డ్ నెట్​వర్క్​ను పరిశీలించాల్సి ఉంటుంది. అది 5జీని కూడా సూచిస్తే, మీ ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క.

ఓక్లా నిర్వహించిన ఒక మార్కెట్ సర్వే ప్రకారం చూస్తే, భారతీయులు 5జీ ఫోన్ ఉపయోగిస్తూ తమ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్​ను పరీక్షించుకుంటున్నారు. ఎంతో మంది భారతీయులు ఇప్పటికే 5జీ సామర్థ్యం కలిగిన ఉపకరణాలను ఉపయోగిస్తూ స్పీడ్ టెస్ట్ యాప్​ను రన్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే.. 5జీ అప్​గ్రేడేషన్ అనేది ఖరీదైన హ్యాండ్​సెట్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే, ఒక నూతన మొబైల్ రీఛార్జ్ ప్లాన్​ను కొనుగోలు చేసినంత సులభం కానుందని ఈ సర్వే తెలుపుతోంది. 5జీ అనేది ఖరీదైన ఫోన్లలోనే కాకుండా మధ్యస్థాయి ఫోన్లలో కూడా ఒక సాధారణ ఫీచర్​గా ఉంటోంది.

మీ మొబైల్ నెట్​వర్క్ సెట్టింగ్స్​లో ఎక్కడా.. మీకు 5జి అనేది కనిపించకపోతే, మీ ఫోన్ 5జీని సపోర్ట్ చేయదనే అర్థం! అలాంటప్పుడు మాత్రం మీరు 5జీని సపోర్ట్ చేసే కొత్త ఫోన్ కొనుక్కోవాలి.

మనకి కొత్త 5జి ఫోన్ అవసరమా?

5G smartphones : అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది నాటికి వివిధ నగరాల్లో 5జీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి మాత్రం అది మెట్రో నగరాల్లోనే లభ్యం కానుంది. మీరు ఢిల్లీ, ముంబై, కోల్​కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులలో నివసిస్తున్నట్లయితే, వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అనుభూతి పొందేందుకు మీ వద్ద 5జీ ఫోన్ తప్పక ఉండాల్సిందే! 5జీ ఫోన్ ను కొనడం ఎంతో ప్రయోజనకరం అవుతుంది. అహ్మదాబాద్, లక్నో, చంఢీగఢ్, గురుగ్రామ్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ఇతర నగరాల్లో 5జీ కనెక్టివిటీ మరికొన్ని రోజుల తరువాత రానుంది.

దేశంలో 5జీని మొదటగా ఆవిష్కరించే 13 నగరాల పేర్లను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇప్పటికే ప్రకటించింది. మొదట పెద్ద పెద్ద నగరాల్లో ఈ కవరేజీ అందుబాటులోకి వస్తుంది. టాప్ 100 భారతీయ నగరాల్లో 5జి కవరేజ్ ప్లానింగ్ ను ఇప్పటికే పూర్తి చేసినట్టు జియో ప్రకటించింది. 2024 నాటికి దేశంలో గ్రామీణ ప్రాంతాలతో సహా అన్ని నగరాల్లోనూ కవర్ చేయాలన్న సంకల్పంతో ఎయిర్​టెల్ ఉంది.

5జీ స్మార్ట్​ఫోన్స్​ ఇస్తున్న కంపెనీలు..

వివిధ ధరల శ్రేణుల్లో యాపిల్ ఐఫోన్​, శాంసంగ్, షియోమి, పోకో, రియల్ మీ, వివో వంటి బ్రాండ్లు 5జీ స్మార్ట్​ఫోన్ మార్కెట్​లో ఉన్నాయి. 5జీ చిప్​సెట్ తయారీ సంస్థలు.. మీడియా టెక్, క్వాల్​కమ్ వంటి వాటితో వ్యూహాత్మక ఒప్పందాలతో ఓఈఎంలు చాలా తక్కువ ధరకే.. అంటే రూ. 15,000లకే 5జీ స్మార్ట్​ఫోన్లను అందించగలుగుతున్నాయి. ఇది 5జీ సేవల కోసం మరింత మంది ముందుకు వచ్చేలా చేస్తుంది. రియల్ మీ వంటి బ్రాండ్లు రూ.10,000లోపుగానే 5జీ ఫోన్లను అందించేందుకు ప్రణాళికలు రచించాయి. 5జీ స్మార్ట్​ఫోన్లను కొనాలనుకునే వినియోగదారులు అనుకూలతలు, ప్రతికూలతలు అన్ని ఒకసారి బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. తమకు సరిపోయే ఫీచర్లు ఉన్న ఫోన్ కోసం చూడాలి.

5జీ ఫోన్ కొనేటప్పుడు ఏయే అంశాలను చూడాలి?

5G service launch date : కొత్త స్మార్ట్​ఫోన్ కొనేటప్పుడు 5జీతో పాటు మరెన్నో ఇతర అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.

5జీ రెడీ ఫోన్ ఒక్కటే సరిపోదు. ఏ విధమైన 5జీ బ్యాండ్స్​ను మీ ఫోన్ సపోర్ట్ చేస్తుందో కూడా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమాచారం ఫోన్ రిటైల్ బాక్స్​పై సులభంగా అందుబాటులో ఉంటుంది. 5జీ స్పెక్ట్రమ్​లో మూడు బ్యాండ్స్ ఉంటాయి. వీటినే టెలికాం కంపెనీలు పొందాయి. లో- బ్యాండ్, మిడ్ -బ్యాండ్, హై- బ్యాండ్​ అని ఉంటాయి. లో-బ్యాండ్ అనేది 700MHz స్పెక్ట్రమ్​ను కలిగి ఉంటుంది. దీన్నే ఎన్​28గా కూడా వ్యవహరిస్తారు. మిడ్ బ్యాండ్ అనేది 3500MHz ను కలిగి ఉంటుంది. దీన్నే ఎన్​78 అని వ్యవహరిస్తారు. దాదాపుగా ప్రతీ 5జీ ఫోన్ కూడా ఎన్​78ను సపోర్ట్ చేస్తుంది. కానీ బాగా ఖరీదైన ఫోన్లలోనే ఎన్​28ను గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే 700MHz అనేది స్టాండ్ అలోన్ 5జీ సేవలకు ఉద్దేశించింది. రిలయన్స్ జియో దీన్ని అందిస్తుంది. హై-బ్యాండ్ అనేది 26GHz స్పెక్ట్రమ్​ను కలిగి ఉంటుంది. దీన్ని mmWave గా, n258గా వ్యవహరిస్తారు. చాలా కొద్ది ఫోన్లు మాత్రమే ఈ n258ను సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే, ఇది mmWave కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ 5జీ ఆరంభంలోనే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు.

5జీ ఎంత వేగంగా ఎంత?

ప్రపంచవ్యాప్తంగా.. 5జీ వినియోగదారులకు 1జీబీపీఎస్​కు మించిన ఇంటర్నెట్​ వేగం అందుతోంది. భారతీయ టెల్కోలు 4జీ కన్నా అధికంగా డౌన్​లోడ్, అప్​లోడ్ వేగాలను అందించేందుకు హామీనిచ్చాయి. అయితే, 5జీ స్పీడ్ అనేది ఆపరేటర్ పైనే కాకుండా, లొకేషన్​పైనా ఆధారపడి ఉంటుంది.

5జీ ఫోన్‌లో 4జీ సిమ్​కార్డ్ పని చేస్తుందా?

ప్రస్తుతం 4జీ సిమ్​కార్డ్ కొత్త 5జీ ఫోన్‌లోనూ ఖచ్చితంగా పని చేస్తుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఎస్​ఎంఎస్​, వాయిస్ కాలింగ్ వంటి 4జీ, 5జీ సేవలను పొందొచ్చు. భారతీయ టెలికాంలు ఎన్​ఎస్​ఏ 5జీ సాంకేతికతను అవలంభించడంతో, వారి ప్రస్తుత 4జీ సిమ్​కార్డ్ Rel 99+ ప్రమాణానికి మద్దతు ఇస్తుంది. ఈ ప్రమాణం 2జీ, 3జీ, 4జీ, 5జీ సేవలు అందించేందుకు అనుకూలంగా ఉంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం