Free LPG Cylinders : ఆ రాష్ట్ర ప్రజలకు గుడ్​ న్యూస్​.. ఇంటికి 2 సిలిండర్​లు ఉచితం!-ahead of polls gujarat announces 2 free lpg cylinders a year per house ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ahead Of Polls, Gujarat Announces 2 Free Lpg Cylinders A Year Per House

Free LPG Cylinders : ఆ రాష్ట్ర ప్రజలకు గుడ్​ న్యూస్​.. ఇంటికి 2 సిలిండర్​లు ఉచితం!

Sharath Chitturi HT Telugu
Oct 17, 2022 09:11 PM IST

Free LPG Cylinders in Gujarat : గుజరాత్​ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి గిఫ్ట్​ని ఇచ్చింది. ఇక నుంచి ప్రతి ఇంటికి ఏడాదికి రెండు సిలిండర్​లను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

ఉచితంగా రెండు గ్యాస్​ సిలిండర్​లు..
ఉచితంగా రెండు గ్యాస్​ సిలిండర్​లు.. (HT PHOTO)

Free LPG Cylinders : గుజరాత్​ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది! ప్రతీ ఇంటికి.. ఇక నుంచి ఏడాదికి రెండు సిలిండర్​లు ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీతు వఘాని సోమవారం వెల్లడించారు. గుజరాత్​ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రకటన వెలువడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఏడాదికి రెండు సిలిండర్​లు ఉచితంగా ఇవ్వడంతో ప్రజలు, గృహిణులపై రూ. 1000కోట్ల భారం తగ్గుతుందని వఘాని తెలిపారు. 38లక్షల మంది గృహిణులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి నగదును వారి ఖాతాలో జమ చేస్తామని తెలిపారు

Free LPG Cylinders in Gujarat : అంతేకాకుండా.. సీఎన్​జీ(కంప్రెస్డ్​ నేచురల్​ గ్యాస్​), పీఎన్​జీ(పైపుడ్​ నేచురల్​ గ్యాస్​)పై 10శాతం వాట్​ను తగ్గించేందుకు గుజరాత్​ ప్రభుత్వం నిర్ణయించిందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు.

సీఎన్​జీపై 10శాతం తగ్గిస్తే.. కేజీకి రూ.6-7 లబ్ధిపొందుతారని వఘాని పేర్కొన్నారు. అదే విధంగా.. పీఎన్​జీపైనా కిలోకు రూ. 5-5.50 లబ్ధిపొందవచ్చని స్పష్టం చేశారు.

గుజరాత్​ ప్రభుత్వం ఈ ప్రకటన చేసి రాష్ట్ర ప్రజలకు దీపావళి గిఫ్ట్​ ఇచ్చిందని విద్యాశాఖ మంత్రి అభిప్రాయపడ్డారు.

ఎన్నికల షెడ్యూల్​..

Gujarat Elections 2022 : గుజరాత్​లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్​ను ఈసీ ప్రకటించాల్సి ఉంది. హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల షెడ్యూల్​ను కొన్ని రోజుల క్రితమే విడుదల చేసింది ఈసీ. వాస్తవానికి అప్పుడే గుజరాత్​ పోలింగ్​ షెడ్యూల్​ కూడా వస్తుందని భావించారు. కానీ అలా జరగలేదు. అందరు షాక్​ అయ్యారు.

కాగా.. గుజరాత్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఈసీ షెడ్యూల్​ను ప్రకటించలేదని, బీజేపీకి ఎన్నికల సంఘం మద్దతుగా నిలుస్తోందని కాంగ్రెస్​తో పాటు ఇతర విపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ ఆరోపణలను కమలదళం తిప్పుకొట్టింది. ఆరోపణల్లో నిజం లేదని తేల్చిచెప్పింది.

Gujarat polls : ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రజలను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు ‘ఉచితాల’ను ప్రకటిస్తున్నాయి. ఆమ్​ ఆద్మీ పార్టీ ఇందులో ముందు వరుసలో ఉంది. ఉచిత విద్యుత్​ వంటి హామీలు ఇస్తోంది. కాంగ్రెస్​ కూడా తన వంతు ప్రయత్నం చేస్తోంది.

గుజరాత్​ను బీజేపీ 27ఏళ్లుగా పాలిస్తోంది. సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి.. మరో దఫా కూడా అధికారం చేపట్టాలని పక్కా ప్రణాళిక రచించింది కమలదళం.

IPL_Entry_Point

సంబంధిత కథనం